ACB Arrests Irrigation Officers : ఎనిమిదేళ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా సాగునీటి శాఖ ఈఈ బన్సీలాల్, ఏఈలు నిఖేష్, కార్తిక్‌లు చెరువులు, జల వనరుల సమీపంలో వెలుస్తున్న బహుళ అంతస్థుల భవనాలు, భారీ వెంచర్లు, టవర్ల నిర్మాణదారుల్లో కొందరికి సంపూర్ణంగా సహకరించి రూ.కోట్లు సంపాదించారు. రంగారెడ్డి జిల్లా సాగునీటి శాఖలో ఈఈగా పని చేస్తున్న బన్సీలాల్ రెడ్ హిల్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
వాస్తవానికి రెండేళ్ల క్రితం కొంగర కలాన్‌లోని రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో సాగునీటి శాఖ విభాగం నుంచి విధులు నిర్వర్తించాలి. ఇందుకు భిన్నంగా రెడ్హిల్స్లోనే పని చేస్తున్నారు. తనతో పాటు అసిస్టెంట్ ఇంజినీర్లు ఉంటే అక్రమాలకు ఉపయోగపడతారనే భావనతో నిఖేష్, కార్తిక్‌లను తన వద్దకు రప్పించుకున్నారు.
ACB Arrest Three Irrigation Officers : ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులు చూడాలన్న నెపంతో ముగ్గురూ బయటకు వెళ్లి, సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవారు. ఆ తర్వాత బిల్డర్ల ప్రతినిధులను కార్యాలయానికి రప్పించుకుని, లేదంటే రిసార్టుల్లో మంతనాలు జరిపేవారు. జల వనరులను ఎలా అక్రమించుకోవచ్చన్న అంశాలపై వారికి సూచనలు ఇచ్చేవారని తెలిసింది. రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్న ముగ్గురూ వేర్వేరుగా విదేశాలు చుట్టేసి వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.
41ఏ సీఆర్‌పీసీ నోటీసులకు రూ.2 లక్షలు డిమాండ్ - ఏసీబీ వలలో కానిస్టేబుల్ - ACB RIDE on Police Station
ACB Caught Three Govt Officials : సాగునీటి శాఖలో కార్యనిర్వాహక ఇంజినీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేష్ కుమార్లపై గతంలో వచ్చిన ఆరోపణలపైనా ఉన్నతాధికారులు విచారణ చేయిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా పరిధిలో చెరువులను చెరపట్టిన కొందరు స్థిరాస్తి వ్యాపారులు బన్సీలాల్, నిఖేష్, కార్తిక్‌లకు రూ.కోట్ల లంచం ఇచ్చారని తెలుస్తోంది.
వీటికి సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించారు. వీరితో అంటకాగిందెవరో తెలుసుకునేందుకు ముగ్గురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్న సమయంలోనూ స్టేషనరీ కొనుగోలులో రూ.19 లక్షలకు అవకతవకలకు పాల్పడ్డారని బన్సీలాల్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ విషయంలో ఉన్నతాధికారులు తాఖీదులు ఇచ్చారు. ప్రస్తుతం గండిపేట్ డివిజన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న నిఖేష్ కుమార్, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసిన వారికి ఎన్ఓసీలు ఇచ్చారు.
ముడుపులతో జల్సాలు : బఫర్ జోన్ పరిధిలోకి భవన నిర్మాణాలు రావంటూ లేఖలు ఇచ్చేందుకు రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అవినీతి సొమ్ముతో ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఆధారాలను అనిశా అధికారులు సేకరిస్తున్నారు. లంచం తీసుకున్న కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న గణేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై అనిశా దాడులు- రూ. 2.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి