ETV Bharat / state

పోస్టింగులు, రాజకీయ ప్రాపకం కోసం - ముంబై నటిపై ఫోర్జరీ పత్రంతో కేసు - Mumbai Actress Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

IPS Officers Anarchy In Mumbai Actress Case: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్‌ ఉన్నతాధికారులే వైఎస్సార్సీపీ పాలనలో రాజకీయ ప్రాపకం కోసం దారితప్పారు. పోస్టింగ్‌ల కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో ఓ మహిళపై అన్యాయంగా కేసు బనాయించారు. వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్‌తో కుమ్మక్కై కుట్రకు పాల్పడ్డారు. నకిలీ ధ్రువపత్రాలను అసలు రికార్డులుగా న్యాయస్థానాన్నీ నమ్మించారు. కుట్రలో ఐదుగురు పోలీస్‌ అధికారులు సూత్రధారులుగా విద్యాసాగర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో విచారణ అధికారులు వెల్లడించారు.

IPS Officers Anarchy In Mumbai Actress Case
IPS Officers Anarchy In Mumbai Actress Case (ETV Bharat)

IPS Officers Anarchy In Mumbai Actress Case : ముంబై నటిపై తప్పుడు కేసుతో అరెస్టు చేసి, వేధించిన కేసులో పోలీసు అధికారులు మంచి పోస్టింగుల కోసం దారితప్పారని విచారణ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయ ప్రాపకం కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో కేసు నమోదు చేశారని వెల్లడించారు. ఒప్పంద పత్రం అసలైందా కాదా నిర్ధారించుకోకుండానే పోలీసు అధికారులు కేసు నమోదు చేశారన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్‌తో కుమ్మక్కై, కుట్రకు పాల్పడ్డారన్నారు. రాజకీయ నేతలు ప్రేరేపించడంతో తప్పుడు రికార్డులు సృష్టించి, కేసును ముందుకు నడిపించారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఫోర్జరీ పత్రం, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాన్నీ తప్పుదారి పట్టించారన్నారు. నిరపరాధులను 42 రోజులు రిమాండ్‌లో ఉంచేలా కీలక పాత్ర పోషించారని పోలీసులు సోమవారం కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

కుక్కల విద్యాసాగర్‌ రిమాండ్ రిపోర్ట్​లో కీలక అంశాలు - నిందితుల్లో పలువురు ఐపీఎస్‌లు - Kadambari Jethwani Case Updates

కేసు నమోదు చేయకముందే రంగంలోకి పోలీసులు : ఈ ఏడాది జనవరి 30న ఐపీఎస్‌లో కాంతిరాణా, విశాల్‌ గున్నిలను నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు పిలిపించి ముంబై నటిని అరెస్టు చేయాలని ఆదేశించారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. తర్వాత కాంతిరాణా ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను పిలిచి విద్యాసాగర్‌తో కలిసి తప్పుడు కేసు నమోదు చేయాలని పథకం రచించారన్నారు. ఫిబ్రవరి 1నే ముంబయి వెళ్లే పోలీసు బృందానికి కాంతిరాణా విమాన టికెట్లు బుక్‌ చేయించారని నివేదికలో వివరించారు. కేసు నమోదు చేయకముందే పోలీసులు రంగంలోకి దిగారనడానికి ఇదే సాక్ష్యంగా గుర్తించారు.

వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి అది ముంబై నటి తయారు చేయించిందని కట్టుకథ అల్లారని వెల్లడించారు. ముంబై నటి హైదరాబాద్‌లో మోడలింగ్‌ చేసే సమయంలో విద్యాసాగర్‌ ఆమెకు పరిచయమయ్యారని నిందితుడు పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె 2015లోనే తిరస్కరించారన్నారు. దీంతో విద్యాసాగర్‌ ముంబైనటిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఆమె ఫోన్‌కు నగ్నచిత్రాలను పంపిస్తూ వేధించేవారని నివేదికలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో తనకున్న పలుకుబడి ఉపయోగించి పోలీసు అధికారులను ప్రభావితం చేసి తప్పుడు కేసు పెట్టించి, నటి, ఆమె కుటుంబసభ్యులను అక్రమంగా అరెస్టు చేయించారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

ముంబయి నటి కేసు - కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్‌ - విజయవాడ సబ్‌ జైలుకు తరలింపు - Mumbai Actress Case Updates

విద్యాసాగర్‌ తప్పుడు ఫిర్యాదు : ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న తనకున్న ఐదెకరాల భూమిని సొంతం చేసుకునేందుకు ముంబై నటి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి విక్రయానికి పెట్టారని విద్యాసాగర్‌ గతంలో ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కేసు నమోదైంది. నటిని ముంబయిలో అరెస్టు చేసిన సమయంలో ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌ నుంచి ఈ ఫోర్జరీ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నామంటూ పోలీసులు చూపించారు. ఆ పత్రం 2018లో రాసినట్లు పాత తేదీ వేసి ఉంది. కానీ అందులో ముంబై నటి చిరునామా మాత్రం కొత్తది రాశారు. స్టాంపు పేపరు ముంబై నటే తయారు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐతే అందులో ఆమె సంతకం లేదని ఆ డాక్యుమెంట్‌ ఫోర్జరీ చేశారని గుర్తించారు.

ఫోర్జరీ పత్రాన్ని చూపించి తన ఐదెకరాల భూమిని అమ్ముతానంటూ చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, భరత్‌కుమార్‌ల నుంచి ముంబై నటి 5 లక్షల రూపాయలు బయానా తీసుకున్నారని విద్యాసాగర్‌ తప్పుడు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అప్పట్లో పెట్టిన కేసులో వీరిద్దరినీ పోలీసులు సాక్షులుగా చూపించారు. వీరి నుంచి స్టేట్‌మెంట్లు కూడా తీసుకున్నట్లు కేసును విచారించిన అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ సాక్షులను తిరిగి ఇప్పుడు విచారిస్తే తాము సీఐ వద్ద స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. భూమిని కొనేందుకు ముంబై నటికి 5 లక్షలు బయానా ఇవ్వలేదని అసలు తాము ఎప్పుడూ ఆమెను చూడనేలేదని తేల్చి చెప్పారు. సాక్షుల కాల్‌ డేటాను పరిశీలిస్తే వీరిని నాటి సీఐ విచారించలేదని తేలిందని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వివరించారు.

నిందితుల జాబితాలో పోలీసు అధికారుల పేర్లు : దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా నిందితుల జాబితాలో పోలీసు అధికారుల పేర్లు చేర్చారు. దీని ప్రకారం ఏ2గా అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, ఏ3గా నాటి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తాతా, ఏ4గా అప్పటి విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా నాటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏ6గా అప్పటి డీసీపీ విశాల్‌ గున్నిలను పేర్కొన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో వీరి పాత్ర గురించి స్పష్టంగా వివరించారు.

టెక్నికల్​గా దొరికిపోయారుగా!- సినీనటి ఫోన్​లోకి ఆ ముగ్గురు ఐపీఎస్​ల చొరబాటు - Jethwani Icloud Account Was Hacked

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.