IPL Betting Racket Busted in Hyderabad 2024 : ఐపీఎల్ సీజన్ సందర్భంగా పందెం రాయుళ్లు కోట్ల రూపాయల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో 24గంటల్లోనే 5ముఠాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2కోట్ల 41లక్షల నగదు, ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహించేందుకు వినియోగించే పరికరాలు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. 57బ్యాంకు ఖాతాల్లోని నగదు, 8 యూపీఐ నంబర్లను ఫ్రీజ్ చేశారు. నిలుపుదల చేసిన నగదు, సామగ్రి విలువ రూ.3కోట్ల 29లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ సహా ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Cricket Betting in Hyderabad : బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కూకట్‌పల్లి బాలాజీనగర్‌కు చెందిన పొందూరి సురేశ్‌ను అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు నిందితుడిచ్చిన సమాచారంతో వికారాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. మ్యాచ్ సమయంలో వివిధ బెట్టింగ్ వెబ్‌సైట్ల(Online Cricket Betting) ద్వారా కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి రూ.80 లక్షల నగదు, రూ.2 లక్షల విలువైన బెట్టింగ్ సామగ్రి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో దుండిగల్ పోలీసులు, శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దుండిగల్ మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోదాలు జరిపి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,21,000 నగదు, రూ.4,85,000 విలువ చేసే బెట్టింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని దుబాయ్‌లో అరెస్ట్- త్వరలో భారత్‌కు!
Miyapur Cricket Betting Case : మరో కేసులో మియాపూర్ పరిధిలోని గోకుల ప్లాట్స్‌లో మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు నలుగురు బుకీలను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితులు ఇప్పటివరకూ రూ.15కోట్ల 40లక్షలు బెట్టింగ్ నిర్వహించినట్లు తెలిపారు. వారి నుంచి రూ.కోటి 45లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము నిలుపుదల చేశామని పోలీసులు తెలిపారు. రూ.80 లక్షల విలువ చేసే బెట్టింగ్ సామగ్రి, కారు, చరవాణులు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కేసులో బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు గాజులరామారం పరిధిలో అజయ్‌కుమార్, మహేశ్‌కుమార్ అనే ఇద్దరు బుకీలను అరెస్ట్(Cricket Betting Gang Arrest in Hyderabad) చేశారు. నిందితుల నుంచి రూ.93వేల నగదు, రూ.లక్షా 4వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ల్ని స్వాధీనం చేసుకున్నారు.
సరదాగా ఫోన్ పట్టాడు - నెమ్మదిగా బెట్టింగ్‌కు బానిసయ్యాడు - చివరికి?
Bachupally IPL Betting Case : మరో కేసులో బాచుపల్లి పరిధిలో ముగ్గురు బుకీలను బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల ఖాతాల్లోని రూ.13లక్షలు నిలుపుదల చేశారు. రూ.లక్షా 83వేల విలు చేసే సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కీప్యాడ్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నిర్వహించడం నేరమని ఎవరైనా అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే డయల్ 100కి కానీ సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
IPL Betting Gang Arrested : ఐపీఎల్ టైమ్‌లో జోరుగా బెట్టింగులు.. మరో 3 ముఠాల అరెస్ట్