Investment In Hyderabad : పెట్టుబడి పేరిట హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు లక్షల సొమ్ము కాజేశారు. ఈ జెడ్ ఇన్వెస్ట్ యాప్‌లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించిన సైబర్ నేరగాళ్లు బాధితుడి నుంచి 22 లక్షల 16వేల 732 రూపాయలు కొట్టేశారు. అధిక లాభాలు వస్తాయని, అందుకోసం ట్రేడింగ్ చిట్కాలు చెబుతామని నమ్మించారు. తర్వాత మోసగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో దఫాల వారీగా వాటాలను కొనుగోలు చేసేలా పెట్టుబడులు పెట్టించారు.
చైనా హ్యాకర్ల చేతిలో భారత డేటా- మరో 19 దేశాలపైనా సైబర్ దాడి!
Cyber Fraud : సదరు యాప్‌లో సైబర్ నేరగాళ్లు నకిలీ లాభాలు ప్రదర్శించారు. అవన్నీ నమ్మిన బాధితుడు నిజమే అనుకున్నాడు. తర్వాత లాభాలు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే జీరో బ్యాలెన్స్‌గా చూపించడంతో మోసపోయానని గుర్తించి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఆన్‌లైన్ ఫిర్యాదు చేశాడు. కాగా, నకిలీ ట్రేడింగ్ యాప్‌ల బారిన పడకుండా, ధ్రువీకృత సెబీ వంటి వాటిల్లోనే వ్యాపారాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటన్ 1930 టోల్‌ఫ్రీకి కాల్ చేయాలని cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Stock Market Cyber Fraud In Hyderabad : ప్రస్తుతం సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకు కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లోని 63 ఏళ్ల వృద్దుడి నుంచి స్టాక్ మార్కెట్లో (Stock market) పెట్టుబడి లాభాల ఆశ చూపించి రూ.5.98 కోట్లు కొట్టేశారు. ఒక సైబర్ నేరంలో ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము కోల్పోవడం రాష్ట్రంలోనే అరుదని పోలీసులు చెబుతున్నారు. ఈ స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
స్టాక్మార్కెట్లో పెట్టుబడుల ఆశ చూపి - హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడికి రూ.5.98 కోట్లు టోకరా
ఇలాంటి స్కామ్‌లపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా మోసపోతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు రావన్న సంగతి తెలిసినా, వ్యక్తుల ఆశ సైబర్ క్రైమ్ కేటుగాళ్లకు వరంగా మారుతోంది. ఇలాంటి ఘటనల్లో మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేసే కోల్పోయిన నగదును కొంతమేరకైనా వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ మోసపోయిన వారిలో కొందరు పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం లేదు.
పిగ్ బచ్చరింగ్ స్కామ్ తెలుసా - లేదంటే లక్షల్లో దోచుకుంటారు గురూ!చోరీలు పాతకథ, ఇప్పుడంతా సైబర్ నేరాలే - గణనీయంగా పెరుగుతున్న కేసులు
ప్రజల నమ్మకమే సైబర్ మోసగాళ్లకు పెట్టుబడి - చైనా పరిజ్ఞానంతో జేబులు ఖాళీ