Investigation of Authorities on Quadge Illegal Mining: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులు విచారణ చేపట్టి కేసులు నమోదు చేశారు. 24.37 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. జిల్లాలో జరుగుతున్న మైనింగ్‌పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు అనేక పోరాటాలు చేశారు. స్థానిక అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవటంతో సోమిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. జరిమానాలు విధిస్తూ 275 కేసులు నమోదు చేశారు.
రాష్ట్రంలో చెలరేగిపోతున్న మట్టిమాఫియా - చోద్యం చూస్తున్న అధికారులు - Illegal Gravel Mining
నెల్లూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలపై టీడీపీ నేతల పోరాటానికి ఫలితం దక్కింది. సోమిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతల బృందం నెల రోజులకు ముందు అక్రమాల చిట్టాను కేంద్రానికి పంపించింది. అందులో అనేక సాక్ష్యాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు అక్రమాల మైనింగ్‌ను వెలుగులోకి తెచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హెచ్చరికలతో మైనింగ్ అధికారులు కార్యాలయం నుంచి అడుగు బయటకు వేయలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అక్రమ మైనింగ్‌పై పరిశీలన చేస్తున్నారు.
నందిగం సురేష్ పీఏ వీరంగం- అక్రమ ఇసుక లారీలు అడ్డుకున్న గ్రామస్థులకు బెదిరింపులు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, సైదాపురం, సర్వేపల్లి ప్రాంతాల్లో మొత్తం 12 క్వారీల్లో మైనింగ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అధికారుల తనిఖీలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2.30 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్జ్ ను జీఎస్టీ చెల్లించకుండా తరలించారు. ఇతర జిల్లాలకు చెందిన ట్రాన్సిట్ ఫామ్స్ కొనుగోలు చేసి వాటి ద్వారా మరో 1.12 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తరలించినట్లు అధికారుల తనిఖీలో తెలింది. దీనిపై మొత్తం 22 కేసులు నమోదు చేశారు.
తొమ్మిది లీజుల్లో 2.11 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా తరలించారు. 14 మంది లీజుల పేరుతో 2.18 లక్షల మెట్రిక్ టన్నులు పనిచేయని లీజుల పేరుతో ట్రాన్సిట్ ఫామ్స్‌ను తీసుకుకుని అక్రమ రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎటువంటి లీజులు లేని చోట్ల తవ్వకాలు చేస్తున్న వారిపై 100 కేసులు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో స్థానికంగా ఉన్న నాయకులను అధికారులు విచారిస్తున్నారు.