ETV Bharat / state

అధ్వాన్నంగా ఇందూరు రోడ్ల దుస్థితి - ఇకనైనా మారదా పరిస్థితి - Internal Roads Damage in Nizamabad

Internal Roads Damage in Nizamabad : నిజామాబాద్‌లోని పలు కాలనీల్లో గుంతలు పడిన రోడ్లతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా రహదారుల సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Street Roads Damage
Street Roads Damage in Nizamabad
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 9:30 AM IST

నిజామాబాద్​లో గుంతలు పడి, కంకరతేలి అధ్వానంగా మారిన రోడ్లు

Internal Roads Damage in Nizamabad : నిజామాబాద్‌ నగరంలో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. నాలుగు లక్షల జనాభా ఉన్న కార్పొరేషన్‌(Nizamabad Corporation) పరిధిలోని 60 డివిజన్లలోని దారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. నగరం విస్తరిస్తున్నా పాత, కొత్త అన్న తేడా లేకుండా అన్ని కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సరైన రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాకాలంలో రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొత్త రోడ్లకు నిధులు మంజూరు చేయాలని లేకపోతే కనీసం గుంతలైనా పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన రహదారులను సుందరంగా మార్చిన అధికారులు కాలనీల్లోని దారులను మాత్రం విస్మరించారని విమర్శిస్తున్నారు.

People Suffering Damaged Roads in Nizamabad : విలీన గ్రామాల్లోనూ సరైన వసతులు కల్పించడంలో నగర పాలక సంస్థ విఫలమైంది. ప్రధాన, అంతర్గత దారులతోపాటు మురుగు కాలువలను (Drainage) నిర్మించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కొన్ని కాలనీల్లో కంకర వేసి వదిలేయడంతో ఆ దారిగుండా ప్రయాణించే వారి అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో రోడ్లు లేక ప్రజలు అవస్థలు (People Suffering Damaged Roads) పడుతున్నారు.

"నిజామాబాద్​లో ఎక్కడ చూసిన రోడ్లు సక్రమంగా లేవు. ఎటువైపు చూసిన గుంతల రోడ్లు, రాళ్లు తేలిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఎవ్వరిని అడగాలో తెలియడం లేదు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు వస్తారు ఓట్లు అడుగుతారు. రోడ్లు వేయండి అంటే ఎన్నికలైన తర్వాత అంటారు. అక్కడి నుంచి మరి కనిపించకుండా వెళ్లిపోతారు. వర్షం పడితే చాలు వరద నీరు ఇండ్లలోకి వస్తుంది. రోడ్లపై వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు." - స్థానికులు

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు - ఇప్పటికైనా పనులు మొదలయ్యేనా?

Street Roads Issue in Nizamabad : వినాయక్‌ నగర్, ఆర్యనగర్, మహాలక్ష్మినగర్‌, బ్యాంక్‌ కాలనీ, సాయికృపానగర్‌, గాయత్రినగర్‌, శివాజీనగర్‌, న్యాల్​కల్ రోడ్డు, వర్ని రోడ్డు, ఖిల్లా, బోధన్ రోడ్డులోని దారులు, కంఠేశ్వర్‌, సుభాశ్​నగర్‌, దుబ్బ, గంగాస్థాన్‌ ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు రోడ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. మహాలక్ష్మినగర్, బ్యాంక్ కాలనీలో రోడ్లు కంకర తేలి, గుంతలమయంగా మారడంతో (Roads Damage) రాకపోకలు సాగించడానికి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.

పట్టించుకోని మున్సిపల్ అధికారులు : రోడ్లు బాగు చేయాలని అనేకసార్లు మున్సిపల్ అధికారులకు వినతులు ఇచ్చినా ఏళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని పలు కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మారుతున్నా సమస్య మాత్రం అలాగే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిజామాబాద్‌ నగర పాలక సంస్థ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

రోడ్డుపై ప్రయాణించేదెలా? ఇరుకు రోడ్లతో ఇక్కట్లు - విస్తరణకు మోక్షమెప్పుడో

'అన్నీ సగంలో వదిలేశారు - సారూ మా గోస వినండి, దోమలతో సస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.