ETV Bharat / state

విద్యార్థులకు గుడ్​న్యూస్​ - గుంటూరులో గూగుల్ కోడ్ లాబ్స్ నైపుణ్య శిక్షణ - Indias First Google Code Lab

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 1:25 PM IST

India's First google code lab at Guntur VVIT College : బీటెక్, ఏంటెక్‌లు చేసినా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టు లేకపోవడంతో పోటీ ప్రపంచంలో యువత వెనకపడిపోతున్నారు. కొత్త సాంకేతికతతో సరికొత్త అవకాశాలు పలకరిస్తున్నా అందరూ అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీంతో ఏ పట్టా పొందినా చివరికి మళ్లీ ప్రత్యేకంగా నైపుణ్య కోర్సులు చేయక తప్పడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు గుంటూరు వీవీఐటీ కళాశాలలోని గూగుల్ కోడ్ లాబ్స్ నైపుణ్య శిక్షణ అందిస్తోంది. ఇటీవలే గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు చక్కటి అవకాశాలు అందించే జెన్ ఏఐ ప్రోగ్రాంను ప్రారంభించారు.

indias_first_google_code_lab_at_guntur
indias_first_google_code_lab_at_guntur (ETV Bharat)

India's First Google Code Lab at Guntur VVIT College : ఈ రోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం రేపటికి వినియోగంలో ఉండటం లేదు. సరికొత్త ఆవిష్కరణలు, వినూత్న సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అధునాతన సాంకేతిక వల్ల పాత ఉద్యోగాలు కొన్ని అదృశ్యమవుతున్నాయి. కొత్తవీ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం విద్య, వైద్యం, వినోదం, తయారీ తదితర రంగాల్లో ఆర్టిషియల్ ఇంటెలిజన్స్ కృత్రిమ మేథ హవా నడుస్తోంది. ఇప్పుడు ఏఇతో పాటు వినిపిస్తున్న మరో పేరు జెనరేటివ్ ఆర్టిషియల్ ఇంటెలిజన్స్.

విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించడానికి గూగుల్‌ సంస్థతో కలిసి పని చేస్తోంది గుంటూరు వీవీఐటి కళాశాల. విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు గూగుల్ కోడ్​ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఈ కళాశాల. తాజాగా గూగుల్‌ క్లౌడ్‌ ప్రోగ్రామ్‌ ప్రతినిధులు శ్వేతా కొమ్మినేని, గూగుల్‌ టెక్నికల్‌ హెడ్‌ ఆకాష్‌ సిన్హాలు జెన్ ఏఐ ప్రోగ్రామ్‌ను విద్యార్థుల కోసం ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి వీవీఐటీ కళాశాలలోని గూగుల్‌ కోడ్ ల్యాబ్‌లో జెన్‌ ఏఐ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసింది ఎల్‌ 4జీ సంస్థ. గూగుల్‌ కోడ్ ల్యాబ్‌ నందు గూగుల్‌ క్లౌడ్‌ జెన్‌ ఏఐ ప్రోగ్రామ్‌ ఎల్‌ 4జీ సంస్థ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'విద్య, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, మ్యూజిక్, సినిమా, తయారీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జెన్‌ ఏఐ సాంకేతికతలో మంచి పట్టు సాధించేందుకు, చక్కటి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ప్రోగ్రాం మాకు ఉపయోగపడుతుంది.రానున్న రోజులలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో మానవ వనరుల స్థానంలో జెన్‌ ఏఐ సేవలు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సాంకేతికతను నేర్చుకోవడం వల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యూనివర్శిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ కార్యక్రమం ద్వారా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో చర్చించి ఆవిష్కరణలు, ప్రాజెక్టుల గురించి తెలుసుకోగలుగుతున్నామన్నాం.' - ఇంజినీరింగ్ విద్యార్థులు

2017లో ఏర్పాటైన ఈ గూగుల్ కోడ్ ల్యాబ్ ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు జెన్ ఏఐ తో పాటు ప్రస్తుతం అవసరమైన వివిధ ఆన్ లైన్ కోర్సులను అందిస్తున్నారు. హ్యాకథాన్, మిషన్ లెర్నింగ్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ తో పాటు వివిధ సర్టిఫికెట్ కోర్సులు, ప్రాజెక్టు ఆధారిత కార్యక్రమాల్లో ఇంజినీరింగ్ యువతకు శిక్షణ ఇస్తున్నారు. సెమిస్టర్ విధానంలో అకడమిక్ తరగతులు నిర్వహిస్తూనే నానో డిగ్రీ ప్రోగ్రాం, ప్రాజెక్టు బేసిడ్ లెర్నింగ్ లాంటి పలు కీలకమైన కోర్సులను విద్యార్థుల అభిరుచి మేరకు నేర్పిస్తున్నారు. సివిల్, మెకానికల్, ఐటీ, ట్రిఫుల్ ఈ, ఏఈ వంటి ఏ విభాగంలో ఇంజినీరింగ్ చేస్తున్నప్పటికీ విద్యార్థులకు ఆసక్తి ఉన్న ఆన్ లైన్ కోర్సులను ఈ గూగుల్ కోడ్ ల్యాబ్ ద్వారా అందిస్తున్నారు. కంపెనీలు ఆశిస్తున్న నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు ఈ గూగుల్ కోడ్ ల్యాబ్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

కాస్ట్యూమ్ డిజైనింగ్ పోటీల్లో బంగారు పతకం- దిల్లీలో సత్తా చాటిన తెలుగు తేజం - COSTUME DESIGNING

'సాధారణంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉండే కంప్యూటర్ ల్యాబ్​లతో పోలిస్తే గూగుల్ కోడ్ ల్యాబ్​లో అత్యాధునిక సిస్టమ్స్​తో పాటు డ్యూయల్ మానిటర్లు అందుబాటులో ఉండటం వల్ల ప్రాజెక్టులు, హ్యాకథాన్లు వేగంగా పూర్తి చేసేందుకు విద్యార్థులు వీలు అవుతుంది. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ , క్వాంటం కంప్యూటింగ్, నాసా స్పేస్ వంటి అనేక సాంకేతిక అంశాలపై కార్యశాలలు నిర్వహించడం వల్ల ఆ అంశాలపైన మంచి నైపుణ్యం సొంతం చేసుకుని అంతర్జాతీయ ప్లాట్ ఫామ్స్ మీద ప్రతిభ చూపేందుకు విద్యార్థులకు అవకాశం లభిస్తోంది.' -కృష్ణప్రసాద్, వీవీఐటీ కళాశాల అధ్యాపకులు

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

ఈ గూగుల్ కోడ్ ల్యాబ్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఆన్ లైన్ కోర్సులు, వైవిధ్యమైన నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంటున్నామని ఇంజినీరింగ్ విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.