Illegal Products Frauds In Hyderabad : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, ఈ కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకు కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా సికింద్రాబాద్‌లోని ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మేము ముంబయి పోలీసులమని, మీ పేరు మీద వచ్చిన పార్శిల్లో అక్రమ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పారు. ముంబయి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అది పోలీసులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలంటే రూ. 19 లక్షల 39 వేలు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. అతన్ని స్కైప్ కాల్ ద్వారా విచారణకు హాజరు కావాలని సూచించారు.
సైబర్ బాధితులకు ఊరట - కేసుల పరిష్కారంపై ఈనెల 9న మెగా లోక్అదాలత్
Cyber Frauds In Hyderabad : భయంతో బాధితుడు స్కైప్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. సైబర్‌నేరగాళ్లు సీబీఐ, ఆర్బీఐ డాక్యుమెంట్స్‌తో ముంబయి పోలీసుల యూనిఫార్మ్స్, ఐడీ కార్డ్స్‌తో విచారణ చేశారు. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతామని బాధితుడిని నమ్మించారు. ఈ కేసులో ఎన్ఓసీ సర్టిఫికేట్ జారీ చేసేందుకు రూ. 19 లక్షల 39 వేలు పంపించాలని డిమాండ్ చేశారు. నగదు ట్రాన్స్ఫర్ చేసిన కొన్ని నిమిషాల్లో రిఫండ్ చేస్తామని నమ్మబలికారు.
సైబర్ నేరాలపై అవగాహన ఉన్న ఆ వ్యక్తి అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచించారు. కస్టమ్స్ అధికారులు ఎప్పుడు స్కైప్ ద్వారా కాల్స్ చేయరని ఇలాంటి ఫోన్ వచ్చినప్పుడు వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. అవగాహన లేని వారే కాకుండా విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా ఈ సైబర్ క్రైమ్ నిందితుల మాటలకు బోల్తా పడ్డారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని బెదిరించగానే వారు చెప్పినట్లుగా చేస్తున్నారు. సాధారణంగా కేసులు నమోదు అయితే సంబంధింత విభాగం అధికారులు ఫోన్ చేయరు. నేరుగా వచ్చి అరెస్ట్ చేస్తారు. కానీ సైబర్ నేరగాళ్లు మాత్రం చాలా తెలివిగా భయపెట్టి డబ్బులు లాగేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష.
సైబర్ నేరాల పట్ల స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష - జనం అవగాహన రాహిత్యమే నేరగాళ్లకు అవకాశం
పెట్టుబడుల పేరిట 70 ఏళ్ల వృద్ధుడి నుంచి 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు