Illegal Mining Pedda Gutta in Warangal District : సహజంగా గుట్టలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంటాయి. పశు పక్ష్యాదులకు ఆహారం, నీడ సమకూరుస్తుంటాయి. కలప, ఇతరత్రా అవసరాల కోసం మనుషులకు ఉపయోగపడతాయి. అలాంటి వాటిపై మైనింగ్ మాఫియా కన్నుపడటంతో యథేచ్ఛగా గుట్టల్ని కరిగించేస్తున్నాయి. వీరికి రాజకీయ అండదండలు ఉండటంతో ఎవరూ నోరు మెదపడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సర్వే నెంబర్ 132లో 137 ఎకరాల్లో పెద్దగుట్ట విస్తరించి ఉంది. అక్కడ జరుగుతున్న మైనింగ్‌ను కొలన్‌పల్లి, ఆరెగూడెం, కేశవాపురం, జయరాం తండా వాసులు వ్యతిరేకిస్తున్నారు. గుట్టపై రంగుల గ్రానైట్‌ను వెలికి తీసేందుకు 2019లో ఓ గుత్తేదారు మైనింగ్ శాఖ వద్ద 20 ఏళ్లకు అనుమతి తెచ్చుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి మైనింగ్ శాఖల నుంచి ఐదేళ్లకోసారి అనుమతులు పునరుద్ధరించుకోవాలి.
సంగారెడ్డి జిల్లాలో పేదల భూములపై క్రషర్ వ్యాపారుల కబంధహస్తం
Illegal Mining in Telangana : కానీ గడువు పూర్తైనా వందలాది చెట్లను నరికి గుట్టపైకి పెద్ద రహదారి నిర్మించారు. మైనింగ్ (Illegal Mining) కార్యకలాపాలకు అనుమతి ఇవ్వొద్దని స్థానికులు, పర్యావరణవేత్తలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణలో ఉండగానే, గుట్టపై తవ్వకాలు జరుపుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌తో పాటు తీవ్రస్థాయిలో పేల్చివేతలు చేస్తుండటంతో పర్యావరణానికి పెను విఘాతం కలుగుతోంది. పరిసరాల్లోని ఇళ్లు బీటలు వారుతున్నాయి.
పెద్ద గుట్ట మీద అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నారు. వీటిని వెంటనే ఆపేయాలి. మాపైన కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో మైనింగ్ వచ్చినప్పుడు మేమంతా అడ్డుకున్నాం. మా నాలుగు గ్రామాల ప్రజలకు ఈ గుట్ట జీవనాధారంగా ఉంది. బాంబులు పెట్టి మైనింగ్ చేయడం వల్ల బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అప్పటి వరకు మేము ఉద్యమాన్ని విరమించం. - పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు
దీంతో సమీపంలోని పంట పొలాల్లో దుమ్ము, ధూళి చేరడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. సమీపంలోని నివాస గృహాలకు బీటలు వారుతున్నాయి. అంతేకాకుండా బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. తద్వారా వ్యవసాయానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ సమితి పేరుతో నాలుగు గ్రామాల ప్రజలు మైనింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అయితే గుత్తేదారులు కొందరు అధికారులకు ముడుపులు ముట్టజెప్పి గుట్టను గుల్ల చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రణరంగంగా మారిన పులిగుట్ట.. మైనింగ్ పనులను నిలిపివేయాలని గ్రామస్థుల ఆందోళన
మరోవైపు గుత్తేదారు కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 23 మందిపై కేసులు నమోదయ్యాయి. మైనింగ్ (Minerals Mining) కబంధహస్తాల నుంచి పెద్ద గుట్టను కాపాడాలని ఈ నెల 14న కలెక్టర్ ప్రావీణ్యకు పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు లేఖ అందించారు. అధికారులు త్వరితగతిన స్పందించేలా చూడాలని ప్రజాప్రతినిధులకు స్థానికులు విన్నవిస్తున్నారు.
కామారెడ్డిలో అక్రమ మైనింగ్ దందా - స్థానికుల భయాందోళన
Illegal Mining in Gadwal District : 'మనల్ని ఎవడ్రా ఆపేది.. తవ్వేయండి.. తర్వాత చూసుకుందాం!'