ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 2058 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు - Liquor Seized the Police

Illegal Liquor Bottles Seized the Police in NTR District: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోలీసుల తనిఖీల్లో భాగంగా పోలీసులు వేర్వేరు జిల్లాల్లో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్​ జిల్లాలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 908 బాటిళ్లను, పల్నాడు జిల్లాలో 1050 మద్యం సీసాలను, నందిగామలో 100 సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Illegal Liquor Bottles Seized the Police
Illegal Liquor Bottles Seized the Police (ఈటీవీ భారత్​)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 9:25 PM IST

Illegal Liquor Bottles Seized the Police in NTR District: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్​ జిల్లాలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పల్లంపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను వీరులపాడు పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు 908 మద్యం బాటిల్స్​ను ఆటోలో తరలిస్తున్న షేక్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాకినాడలో భారీగా మద్యం పట్టివేత - పోలీసుల అదుపులో డ్రైవర్​ - Liquor Seized

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నగర శివారులో పరిమితికి మించి తరలిస్తున్న 1050 మద్యం బాటిళ్లను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 2 లక్షల ఉంటుందని సేబ్ అధికారులు తెలిపారు. మద్యం బయటకు సరఫరా చేస్తున్న రెస్టారెంట్​ను సెబ్ అధికారులు సీజ్ చేశారు. మద్యం తరలిస్తున్న కారును, ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పిఠాపురంలో భారీ మద్యం డంప్​లు - రూ.80 లక్షల విలువ చేసే లిక్కర్ స్వాధీనం - Liquor Seized

తెలంగాణ నుంచి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నందిగామకు అక్రమంగా స్కూటీపై తరలిస్తున్న 100 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలోని కోదాడ నుంచి ఒక వ్యక్తి స్కూటీపై 100 మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి స్కూటీలో వేరువేరు ప్రాంతాల్లో రహస్యంగా నందిగామకు తరలిస్తుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. నందిగామ శివారు అనాసాగరం ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీలో అక్రమ మద్యం ఉందని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఏసీబీ రవి కిరణ్ ,సీఐ హనీష్ స్కూటీని పరిశీలించి మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవికిరణ్ హెచ్చరించారు.

నెల్లూరు జిల్లాలో కోటి విలువైన మద్యం డంప్‌ - వైసీపీ నాయకుడిదేనా! - one crore worth liquor seized

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అధికారులు ఎక్కడికక్కడ చెక్​పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. భారీగా మద్యం, డబ్బును రవాణా చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తారనే ఉద్దేశంతో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా కొంతమంది అక్రమంగా మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో భారీ మద్యం డంప్‌ స్వాధీనం- సోదాల్లో 58,080 మద్యం సీసాలు లభ్యం - LIQUOR DUMP IN Krishna district

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.