Illegal Constructions Demolition in Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణలు తొలగించారు. చెరువుకు ఆనుకుని గత కొన్నేళ్లుగా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలు తొలగించే ప్రాంతానికి వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు వచ్చారు. వాటిని తొలగించడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా, ఆక్రమణ స్థలాలు ఖాళీ చేయకపోవడంతో తొలగింపు చర్యలు చేపట్టారు.
Demolitions in Machilipatnam : కాగా గత కొంత కాలంగా ఏపీలో బుల్డోజర్ల హవా నడుస్తోంది. గత ప్రభుత్వంలో చెరువులు, కుంటల్లోని అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే కొద్ది నెలలుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
కొద్ది నెలల క్రితం మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంట మడుగు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. అనుమతిలేకుండా 180 ఇళ్లను పోరంబోకు భూమిలో నిర్మించారు. దీంతో వారికి నోటీసులు ఇచ్చి, అనంతరం విద్యుత్ కనెక్షన్లను తొలగించి కూల్చివేశారు. మడుగు పోరంబోకు భూమిలో ఎటువంటి నిర్మాణాలను చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. తాజాగా మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సెంటర్ లో ఆక్రమణలు అధికారులు తొలగించారు.
ఏపీలో బుల్డోజర్ల హవా - మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం - Demolition Houses in Machilipatnam