ETV Bharat / state

ఏపీఎండీసీ నుంచి ద్వివేదికి రూ.80 లక్షలు - అడ్డు చెప్పని ఎండీ వెంకటరెడ్డి - Gopal Krishna Dwivedi Funds Misused

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 12:53 PM IST

IAS Gopal Krishna Dwivedi Funds Misused: ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ అధికారి వైద్య బిల్లుల కోసం దారితప్పారు. ప్రభుత్వం నుంచి కాకుండా, తాను అదనపు బాధ్యతలు చూస్తున్న కార్పొరేషన్‌ నుంచి పలు దఫాలుగా లక్షల రూపాయలను తీసుకున్నారు. గనులశాఖ పూర్వపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిధుల దుర్వినియోగం తాజాగా బయటికొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి.

IAS_Gopal_Krishna_Dwivedi_Funds_Misused
IAS_Gopal_Krishna_Dwivedi_Funds_Misused (ETV Bharat)

IAS Gopal Krishna Dwivedi APMDC Funds Misused: అధికారులు, ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన గనులశాఖ పూర్వపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వైద్యబిల్లుల కోసం దారి తప్పారు. ప్రభుత్వం నుంచి కాకుండా, తాను అదనపు బాధ్యతలు చూస్తున్న కార్పొరేషన్‌ నుంచి పలు దఫాలుగా 80 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా బయటకొచ్చింది. ద్వివేది నాలుగున్నరేళ్లపాటు గనులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూశారు.

వైఎస్సార్సీపీ 'ముఖ్య'నేతలకు, అప్పటి గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సాగిలపడటంతో చివరి వరకు ఆయన్నే కొనసాగించారు. ఏపీఎండీసీకి కొంతకాలం ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ పదవిని అడ్డుపెట్టుకుని మెడికల్‌ బిల్లులు రీయింబర్స్‌ చేసుకున్నారు. ద్వివేది తల్లిదండ్రులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ చికిత్సలు చేయించారు. వాస్తవానికి ఆయన అఖిల భారత సర్వీసు అధికారి కావడంతో ఈ బిల్లులు ప్రభుత్వం నుంచి తీసుకోవాలి.

అయితే గత ఐదేళ్లలో ఏ బిల్లులూ సకాలంలో ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ద్వివేది కళ్లు ఏపీఎండీసీపై పడ్డాయి. తాను ఛైర్మన్‌గా కొనసాగుతున్నందున, తల్లిదండ్రుల వైద్యఖర్చులను రీయింబర్స్‌ చేయాలని ఆదేశించారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనా, అప్పటి ఎండీ వెంకటరెడ్డి అడ్డుచెప్పలేదు. ద్వివేది అడిగిందే తడవుగా చెల్లించడం మొదలుపెట్టారు.

రెండేళ్ల కిందట మదనపల్లెకు చెందిన షమీమ్‌ అస్లామ్‌ను ఏపీఎండీసీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అయినా ద్వివేదికి వైద్యబిల్లుల చెల్లింపు ఆగలేదు. మొత్తం రూ.80 లక్షలు ఏపీఎండీసీ తరఫున చెల్లించారు. ఎండీయే బిల్లులు ఇవ్వాలని వెంటపడుతుంటే తాము అభ్యంతరం ఎలా చెబుతామని కొందరు అధికారులు పేర్కొన్నారు.

టీటీడీలో అక్రమాలపై విచారణ - నిధుల వినియోగంపై లెక్కలు తీస్తున్న విజిలెన్స్‌ విభాగం - Enquiry on Irregularities in TTD

ఓఎస్డీకి ఏడాదిన్నరగా చెల్లింపులు: గనులశాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ సాయి గతంలో ఏపీఎండీసీకి ఓఎస్డీగా డిప్యుటేషన్‌పై వచ్చారు. ఓ అంశంపై మంత్రి ఆగ్రహించడంతో ఆయన్ను మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు ప్రాజెక్టుకు బదిలీచేశారు. దీంతో ఏడాదిన్నరగా సెలవులోనే ఉన్నారు. ఆయనకూ ఏపీఎండీసీ నుంచి ప్రతినెలా మెడికల్‌ బిల్లులు రీయింబర్స్‌ చేశారు. ఆయన గనులశాఖ అధికారి కావడంతో, ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకోవాలి. కానీ ఎండీ వెంకటరెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో కార్పొరేషన్‌ నుంచే ఇప్పటివరకు బిల్లులు చెల్లించారు.

రూ.9 కోట్ల కోసం మ్యాన్‌పవర్‌ ఏజెన్సీ ప్రయత్నాలు: ఏపీఎండీసీ 2019లో ఇసుక వ్యాపారం ఆరంభించినప్పుడు మురళీ మ్యాన్‌పవర్‌ ఏజెన్సీ ద్వారా వందల సంఖ్యలో పొరుగుసేవల ఉద్యోగులను నియమించుకున్నారు. అప్పట్లో వీటిలో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 2021 మే నెలలో ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం నుంచి వైదొలిగాక వారిలో చాలామందిని తొలగించారు. అప్పటివరకు వారి జీతాలు తదితరాలన్నీ ఏజెన్సీకి చెల్లించారు.

అయితే కొవిడ్‌ సమయంలో ఉద్యోగులకు మెడికల్‌ కిట్లు ఇచ్చానని, బోనస్‌లు ఇచ్చానని, వాటికి రూ.9కోట్లు ఇవ్వాలంటూ ఏజెన్సీ నిర్వాహకులు కొంతకాలంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. గత ఎండీ వెంకటరెడ్డి రెండు దఫాలు ఆ ఫైల్‌కు క్లియరెన్స్‌ ఇచ్చారు. తర్వాత చెల్లింపులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ బిల్లుల మంజూరు కోసం ఏజెన్సీ నిర్వాహకులు లాబీయింగ్‌ మొదలుపెట్టారు.

మంత్రి ఓఎస్డీగా అనూహ్యంగా చేరి.. వెంటనే తప్పించి: గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా ఎవరు నియమితులవుతారనేది ఆ శాఖలో పెద్ద చర్చ జరుగుతోంది. అనూహ్యంగా ఏపీఎండీసీలో డిప్యుటేషన్‌పై ఉండి, ఏడాదిన్నరగా సెలవులో ఉన్న డిప్యూటీ డైరెక్టర్‌ సాయి గతవారం మంత్రి వద్ద ఓఎస్డీగా చేరారు. ఇది తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో రెండు రోజుల్లోనే పంపేశారు. ప్రస్తుతం ఈ పోస్టుకు ముగ్గురు, నలుగురు అధికారులు లాబీయింగ్‌ చేస్తున్నారు.

పథకాలకు జగనన్న పేరు - 6 వేల కోట్లు నిలిపివేసిన కేంద్రం: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.