ETV Bharat / state

'హైడ్రా' నివేదికలో ప్రముఖులకు చెందిన నిర్మాణాలు- జాబితాలో ఎవరెవరివి ఉన్నాయంటే? - HYDRA REPORT ON DEMOLITIONS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 4:04 PM IST

Hydra Report on Demolitions in Hyderabad : హైదరాబాద్​లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తూ ఆక్రమణదారుల్లో హడల్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు హైడ్రా కూల్చివేసిన నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించింది. అందులో ఎవరెవరికి చెందిన నిర్మాణాలు ఉన్నాయంటే?

hydra_report_on_demolitions
hydra_report_on_demolitions (ETV Bharat)

Hydera Operations in Hyderabad : రాష్ట్రంలో సంచలనంగా మారిన చెరువుల బఫర్‌ జోన్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు ఏకంగా 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో పేర్కొంది. కూల్చివేత ద్వారా 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది.

ఎవరెవరివి ఉన్నాయంటే : ఇందులో ఎన్​ కన్వెన్షన్​తో పాటు కావేరి సీడ్స్‌ యజమాని భాస్కరరావుకు చెందిన నిర్మాణం, అలాగే ప్రొ కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనం, మంథని బీజేపీ నేత సునీల్‌ రెడ్డికి చెందిన నిర్మాణం, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌ నిర్మాణం, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్‌ మీర్జా భవనం, నందగిరి హిల్స్‌లో ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం, చింతల్‌ బీఆర్‌ఎస్ నేత రత్నాకరం సాయిరాజు షెడ్డు కూల్చినట్లు నివేదిక సమర్పించింది.

మరోవైపు శనివారం ఉదయం సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చిన విషయం తెలిసిందే. తుమ్మిడికుంట చెరువులో అనధికారిక నిర్మాణం చేయడం వల్లే సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఎన్ కన్వెన్షన్​కు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు లేవని, ఏ న్యాయస్థానం కూడా స్టేలు ఇవ్వలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

ఈ మేరకు తుమ్మిడి కుంట చెరువులోని ఆక్రమణలపై వివరణ ఇచ్చిన రంగనాథ్, ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదారి పట్టించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్​టీఎల్ పరిధిలో 1 ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్​లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించి అనధికారిక నిర్మాణాలు చేపట్టారని, వాటికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రయత్నించగా, అధికారులు తిరస్కరించారని వివరించారు.

హైదరాబాద్​లో హైడ్రా హడల్ - అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి - HYDRA DEMOLITIONS

విశాఖ రైల్వే జోన్​కు భూముల కేటాయింపుపై ప్రభుత్వం ఫోకస్- ముడసర్లోవ స్థలంపై నివేదిక! - visakha RAILWAY ZONE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.