ETV Bharat / state

డబుల్ సెంచరీ దాటిన హైడ్రా కూల్చివేతలు - తెలంగాణ ప్రభుత్వానికి లేటెస్ట్ రిపోర్ట్ - HYDRA Demolitions Latest Report - HYDRA DEMOLITIONS LATEST REPORT

Hydra Demolition Details in Hyderabad : గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు ప్రభుత్వానికి నివేదించింది.

HYDRA Demolitions Latest Report
HYDRA Demolitions Latest Report (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 5:28 PM IST

Updated : Sep 11, 2024, 8:38 PM IST

HYDRA Report to Telangana Govt : తెలంగాణలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 23 ప్రాంతాల్లో 262 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల స్థలాన్ని పరిరక్షించినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

HYDRA Says Demolished 262 Buildings : గత రెండు నెలలుగా చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల పనిపడుతున్న హైడ్రా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఎక్కడా ఉపేక్షించకుండా నేలమట్టం చేస్తోంది. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్​పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా తెలిపింది. అత్యధికంగా అమీన్​పూర్​లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది.

హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బంది : హైడ్రాకు ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రత్యేక పోలీసు సిబ్బందిని సైతం కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. ఈ సిబ్బంది కేటాయింపుతో ఆక్రమణల తొలగింపు చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.

CM Revanth Warn to Invaders : మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సైతం చెరువులు చెరపట్టిన వారికి చెరసాల తప్పదని హెచ్చరించారు. కబ్జాదారులు ఎంత గొప్ప వ్యక్తులైనా వదిలిపేట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, 11,000ల మంది బాధితులకు రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని రేవంత్​రెడ్డి ప్రకటించారు.

వణుకు పుట్టిస్తున్న "హైడ్రా" దూకుడు - ఎఫ్​టీఎల్​ పరిధిలో విల్లాలు నేలమట్టం - Hydra Demolishes Villas in Dundigal

హైడ్రా కీలక నిర్ణయం - ఇప్పటికే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చం : ఏవీ రంగనాథ్‌ - Hydra Clarify On Demolitions

Last Updated : Sep 11, 2024, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.