Hydra Focused on Hyderabad Problems : హైదరాబాద్ నగరంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని హైడ్రా నిర్ణయించింది. నెల రోజులుగా కమిషనర్ ఏపీ రంగనాథ్ వివిధ రంగాల నిపుణలతో సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కూల్చివేతల కోసమే హైడ్రా ఏర్పడిందన్న ముద్రను చెరిపివేసుకోవాలన్న భావనతో ఉన్న అధికారులు, ఇతర సమస్యలపై దృష్టి సారించనున్నారు. దీంతో కూల్చివేతలు తాత్కలికంగా ఆపేయాలని నిర్ణయించారు.
ట్రాఫిక్‌పై ఫోకస్ : రాజధానిలో నిత్యం 50లక్షలకు పైగా వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. చిన్నపాటి వాన పడినా గంటల తరబడి రోడ్లపై ఉండాల్సిందే. ఈ సమస్యపై ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారులతో కలిసి పరిష్కారించాలని ఆలోచిస్తున్నారు. దీని పరిష్కృతం కోసం రెండు విద్యా సంస్థలకు సర్వే బాధ్యతలు అప్పగించారు. పరిష్కారాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక సమర్పించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వాహన రద్దీ సమస్యతో పాటు ఫుట్‌పాత్, రహదారి ఆక్రమణలపై నగర ట్రాఫిక్ విభాగంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.
చెరువుల పరిరక్షణ : నేషనల్ రిమోట్ సెన్సింగ్ విభాగం తీసిన ఫొటోలు, మ్యాప్‌లతో చెరువు వాస్తవ విస్తీర్ణం, మొత్తం చరిత్రను తీసి నిక్షిప్తం చేసేందుకు యత్నిస్తున్నారు. చెరువులపై ఉన్న ఆక్రమణల్లో దాదాపు 85శాతం నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి. వీటిని కూల్చడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డ హైడ్రా అధికారులు ఉన్న చెరువును పరిరక్షించాలని నిర్ణయించారు. నగరంలోని కొన్ని చెరువుల సుందరీకరణను నవంబరులో ప్రారంభించాలని యోచిస్తున్నారు.
ఆ ఒక్క ప్రశ్నతో రంగంలోకి 'హైడ్రా' - దానికోసమే ఇదంతా - మీకు తెలుసా?
నాలాల విస్తరణ : హైదరాబాద్‌లో సుమారు 200 కి.మీ.ల మేర నాలాలు ఉన్నాయి. వీటిపై సుమారు 15వేల నిర్మాణాలు ఉన్నాయని గతంలో అధికారులు గుర్తించారు. వీటిని కూల్చడం ప్రభుత్వానికి అసాధ్యం. చాలావాటికి బల్దియా పర్మిషన్స్ ఉన్నాయి. బాధితులకు పరిహారం ఇవ్వాలంటే రూ.వేల కోట్లు కావాల్సిందే. పెద్ద నాలాల పరిధిలో సుమారు 1400 చోట్ల మూడొంతుల ఆక్రమణకు గురై వర్షం నీరు కిందికి వెళ్లడం లేదు. వీటిని తొలగించి నాలాలను విస్తరిస్తే వరద నీటి ముంపు సమస్య తొలగుతుంది. బల్దియాతో కలిసి దశలవారీగా ఈ పనులు చేయాలని హైడ్రా సిద్ధమైంది.
చర్యల కోసం సిబ్బందికి ట్రైనింగ్ : గత సర్కార్ హయాంలో నగరంలో భారీ వర్షాలు కురిసినా, ఇతర ఉపద్రవాలు వచ్చినా తక్షణ చర్యల కోసం కార్యాచరణ రూపొందించారు. అందుకు సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తీసుకున్నారు. ఈ విభాగం నగర అవసరాలకు పెద్దగా ఉపయోగపడకపోవడంతో ప్రస్తుతం వీరిని హైడ్రాలో వీలినం చేశారు. వీరు విపత్తుల సమయంలో పోలీసులతో కలిసి పని చేసేలా, అందుకు వారికి ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. ముఖ్యంగా వర్షాలకు రోడ్లపై చేరిన నీళ్లను నాలాల్లోకి మళ్లించడం, ట్రాఫిక్ నియంత్రించడంలో వీరి సేవలు ఉపయోగించుకుంటారు.
నగరంలో వందలాది పార్కులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటి తొలగింపునకు హైడ్రా అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. పార్కుల నిర్వహణ బాధ్యతను స్థానిక కాలనీ సంఘాలకే అప్పగించాలని యోచిస్తున్నారు.
మళ్లీ జేసీబీలకు పనిచెప్పిన హైడ్రా - ఈసారి రూట్ మార్చిందిగా!
కూల్చివేతలే కాదు ఇక నుంచి రైట్ రైట్ కూడా - హైదరాబాద్ ట్రాఫిక్‌పై హైడ్రా ఫోకస్