ETV Bharat / state

హైడ్రా ఫోకస్​ వారి పైనే - ఇక దూసుకుపోనున్న వాహనాలు - HYDRA FOCUS ON TRAFFIC

హైడ్రా, ట్రాఫిక్ సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్‌ - సాయం అందించనున్న విపత్తు స్పందన బృందాలు

hydra_focus_on_traffic_control
hydra_focus_on_traffic_control (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 4:42 PM IST

Hydra Focus on Traffic Control : హైదరాబాద్‌లో ఏదైనా పని ఉందంటే సమయం, ఎన్ని కిలోమీట్లరు, ఇవన్నీ లెక్కేసుకుని వచ్చిన దానికంటే గంట ముందే ప్రయాణం ప్రారంభించాలి. కారణం ట్రాఫిక్‌. లేకుంటే పని సమయం అయిపోయినా మనం మాత్రం ఇంకా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉంటాం. నగరంలో అంత ట్రాఫిక్ ఉంటుంది మరి. పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి హైడ్రా రంగంలోని దిగుతోంది. వాహన రద్దీ సమస్యతో పాటు ఫుట్‌పాత్‌, రహదారి ఆక్రమణలపై నగర ట్రాఫిక్‌ విభాగంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.

"హైడ్రా కూల్చివేతలు" - ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్​రెడ్డి కొత్త పాలసీ!

ఇరు విభాగాలు సంయుక్తంగా పని చేసి : హైడ్రా, ట్రాఫిక్ విభాగాలు కలిసి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించికి ఆక్రమణలను తొలగించనున్నాయి. హైడ్రా ఆధీనంలోని విపత్తు స్పందన బృందాలు ట్రాఫిక్‌ నియంత్రణలో పని చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు విభాగాలు కలిసి పనిచేయాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పి. విశ్వప్రసాద్‌ నిర్ణయించారు. ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులతో కలిసి పనిచేసేందుకు డీఆర్‌ఎఫ్‌ బృందాలకు ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. హైడ్రా అధికారులు, నగర ట్రాఫిక్‌ డీసీపీ, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లతో రంగనాథ్, విశ్వప్రసాద్‌ గురువారం సమావేశమయ్యారు. నెలకోసారి ఇరు విభాగాలు కలిసి భేటీ కావాలని నిర్ణయించారు.

మహానగరం ట్రాఫిక్​పై పోలీసుల స్పెషల్ ఫోకస్​ - వానొచ్చినా, వరదొచ్చినా ఇక ఆగకుండా వెళ్లేలా! - police focus on hyd traffic problem

  • ప్రధాన రహదారులు, కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మించిన శాశ్వత దుకాణాలు గుర్తించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. గుర్తించిన వాటి దుకాణాదారులకు ముందస్తు సమాచారం ఇచ్చి తొలగించాలి.
  • ఫుట్‌పాత్‌ల మీద విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, టెలిఫోన్‌ డక్ట్‌లు, జీహెచ్‌ఎంసీ చెత్తడబ్బాలు గుర్తించి, సంబధింత అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని తొలగించాలి.
  • పాదాచారులు సాఫీగా వెళ్లేలా ఫుట్‌పాత్‌లు నిర్మించాలి. ట్రాఫిక్‌ విధులపై డీఆర్‌ఎఫ్‌ బృందాలకు ట్రైనింగ్‌ ఇవ్వాలి.
  • హైదరాబాద్‌లోని రహదారులుపై 144 నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించారు. అందులో 65 హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఉన్నాయి కాగా వాటిని ప్రాధాన్యక్రమంలో పరిష్కరించాలి.
  • వరద నీరు వెంటనే తొలగించేదుకు భారీ మోటర్లు ఉపయోగించాలి. ఈ ప్రాంతాల్లో శాశ్వత పరిష్కరించేందుకు కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలి. వరద కాలువలు, పైపుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలి.

హైడ్రా ఎఫెక్ట్! - రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి - రూ.300 కోట్లు లాస్

హైడ్రాకి ఇక స్పెషల్ పవర్స్ - ప్రభుత్వ ఆర్డినెన్స్‌కి గవర్నర్‌ ఆమోదం - GOVERNOR APPROVED HYDRA ORDINANCE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.