ETV Bharat / state

ఇదోరకం వలపు వల- హాయ్ అంటూ మెసేజ్ చేస్తారు పబ్​కు తీసుకెళ్లి? - Hyderabad Dating Scam - HYDERABAD DATING SCAM

Dating Apps Fraud in Hyderabad: హైదరాబాద్​ మహానగరంలో డేటింగ్​ స్కాం వెలుగులోకి వచ్చింది. యువకులకు వలపు విసిరి అందమైన అమ్మాయిలు పబ్​లకు తీసుకెళుతున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, భారీగా ఫుడ్​ ఆర్డర్​ ఇచ్చి అక్కడి నుంచి జంప్​ అవుతున్నారు. ఇప్పటి వరకూ 8 మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో పబ్​ యాజమాన్యం, యువతులు ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Dating_Scam_in_Hyderabad
Dating_Scam_in_Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 7:41 PM IST

Dating Scam in Hyderabad: నేటి తరం యువత 24 గంటలు సోషల్​ మీడియాలోనే గడుపుతున్నారు. ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​, ఎక్స్​ అంటూ అనేక సోషల్​ మీడియా యాప్​లను ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు డేటింగ్ యాప్​లు కూడా వినియోగిస్తున్నారు. ఇలాంటి డేటింగ్ యాప్​ల వలలో పడి ఎంతో మంది యువకులు సైబర్ దాడులకు గురవుతున్నారు. ఈ కేటుగాళ్ల మాయలో పడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును కోల్పోతున్నారు.

ఇలాంటి తరహా డేటింగ్ యాప్​తో హైదరాబాద్​లో మరో నయా మోసం తెరపైకి వచ్చింది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న యువత ఇప్పుడు ఈ డేటింగ్​ యాప్​లకు బాగా అట్రాక్ట్​ అవుతున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని కొందరు అందమైన అమ్మాయిలు పబ్​ యజమాన్యంతో కలిసి ఒక దందాను నడుపుతున్నారు. ఇప్పుడు ఆ డేటింగ్​ స్కామ్​ హైదరాబాద్​ నగరంలో బయటపడింది.

New Rules for Social Media in India 2023 : 'ఫొటోలు పెట్టొద్దు.. రీల్స్‌ చేయొద్దు'.. భద్రతా బలగాలకు వార్నింగ్​

విశ్వసనీయ సమాచారం ప్రకారం : టింబర్​, బంబుల్​ వంటి డేటింగ్​ యాప్​లో అందమైన అమ్మాయిలు యువకులకు వలపు వల విసురుతున్నారు. పరిచయం ఏర్పరుచుకొని వెంటనే నంబర్లు మార్చుకుంటున్నారు. కలుద్దామని వాట్సాప్​లో సందేశాలు పంపుతున్నారు. అమ్మాయే ఇన్వైట్ చేయడంతో యువకులు వెంటనే కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఎక్కడ కలుద్దామని అడిగితే మెట్రో స్టేషన్​ వద్దకు రమ్మని చెబుతున్నారు. ఇలా మెట్రో స్టేషన్​ వద్దకు వెళ్లిన యువకులకు అక్కడ పక్కనే ఉన్న పబ్​లోకి అమ్మాయి తీసుకెళ్తోంది.

ఖరీదైన మద్యం, ఆహారం ఆర్డర్​ ఇచ్చి జంప్​ : ఇలా లోపలికి వెళ్లిన తర్వాత యువకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తమకు ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు కావాలని అడుగుతున్నారు. వారి మాటను కాదనలేని యువకులు వాటి తెచ్చి ఇస్తున్నారు. ఇలా గంటలో రూ.40 వేల వరకు బిల్​ చేయిస్తున్నారు. వెంటనే వాష్​ రూంకో, కాస్త సైడ్​కు వెళతానని చెప్పి అక్కడి నుంచి జారుకుంటున్నారు. అక్కడ ఎంతసేపు వెయిట్​ చేసినా ఫలితం ఉండదు. విషయం అర్థమయ్యేలోపే బిల్ కట్టాలని పబ్​ యాజమాన్యం యువకులపై ఒత్తిడి తెస్తోంది.

ఈ డేటింగ్​ యాప్​ పబ్​ స్కాంలో కొసమెరుపు ఏంటంటే పబ్​ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ స్కాంకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త బయట పడటంతో తాము కూడా అలాంటి బాధితులమే అంటూ పలువురు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మంది బాధితులు బయటకు వచ్చారు. అయితే ఈ స్కామ్​పై ఇప్పటివరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

'కిలేడీ' వలపు వల.. 'మిస్టర్​ రాజస్థాన్'​ విలవిల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.