Hyderabad Metro Offers Extended : హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం ఆఫర్లను పొడిగిస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో యాజమాన్యం ప్రకటించింది. మెట్రో రైలులో సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్ స్టూడెంట్ పాస్ ఆఫర్ కొనసాగుతుందన్నారు.
Save more on your daily commute! Hyderabad Metro Rail's Off-Peak Discount gives you 10% off during off-peak hours, extended till 31st March 2025.#landtmetro #mycitymymetromypride #metroride #hyderabadmetro #supersaveroffpeakhour #off #explore #discount pic.twitter.com/suHLR3wJKy
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 30, 2024
అలాగే రద్దీ లేని సమయాల్లో స్మార్ట్ కార్డులపై 10 శాతం తగ్గింపుతో ప్రయాణించే పీక్ ఆఫర్ కూడా పొడిగిస్తున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. ఈ పొడిగింపు మెట్రో ప్రయాణికుల్లో మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. అక్టోబరు 6 నుంచి నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామ మాత్రపు చెల్లింపులతో పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత కోసం నామ మాత్రం రుసుము వసూలు చేస్తున్నట్లు కేవీబీ రెడ్డి వెల్లడించారు.
Ride all day, pay just ₹59! Hyderabad Metro Rail brings you unlimited rides on listed holidays with the Super Saver Offer, extended till 31st March 2025. Make the most of your journeys! #landtmetro #mycitymymetromypride #metroride #hyderabadmetro #supersaverholidaycard… pic.twitter.com/5HO222OnEo
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 30, 2024
Students, here's your chance to travel smarter! Hyderabad Metro Rail extends the Student Pass Offer: Pay for 20 trips and get 30. Now valid till 31st March 2025.#landtmetro #mycitymymetromypride #metroride #HyderabadMetro #studentpassoffer #studentpass #explore #discount pic.twitter.com/JcBKGarzDP
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 30, 2024
అక్టోబరు నుంచి నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు : సూపర్ సేవర్, స్టూడెంట్ పాస్‌ల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో పార్కింగ్ ఫీజు విషయంలో షాకిచ్చింది. వచ్చేనెల నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు నెలలో నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లపై వాహనదారులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. వారి నిరసనల నేపథ్యంలో ఎల్అండ్టీ మెట్రో సంస్థ కూడా వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ అక్టోబరు నుంచి నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామ మాత్రపు చెల్లింపులతో పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నామని ఇవాళ మెట్రో ఎండీ తెలిపారు. మరి ప్రయాణికుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Hyderabad Metro Phase 2 DPRS : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ మొత్తం 116.2 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇందుకు రూ.32,237 కోట్లను అంచనా వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నారు. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ నుంచి సొరంగ మార్గంలో మెట్రో లైన్ వెళ్లనుంది.
కొత్త సిటీలోకి మెట్రో పరుగులు- రెండో దశ డీపీఆర్‌కు తుదిమెరుగులు - HYDERABAD METRO PHASE 2 DPR