ETV Bharat / state

మెట్రో రెండో దశ నిర్మాణానికి ఈ నెల 8న శంకుస్థాపన - మెట్రో రెండో దశ నిర్మాణం

Hyderabad Metro 2nd Phase Update : చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న మెట్రో రైలు ఎంజీబీఎస్ - ఫలక్​నుమా మధ్య పనుల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఈ మార్గంలో పనులకు ఈనెల 8 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 5.5 కిలోమీటర్ల మేర ఈ పనులు పూర్తైతే మెట్రో తొలిదశ పూర్తి అవుతుంది.

Hyderabad Metro 2nd Phase Update
Hyderabad Metro 2nd Phase Update
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 5:54 PM IST

Hyderabad Metro 2nd Phase Update : మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 8న పాతబస్తీలో రెండో దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5. కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలు పెట్టనున్నారు. సాలార్​జంగ్​ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా వరకు మార్గంలో నాలుగు స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రాబోతుంది. రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్​లను ఖరారు చేసింది. అందులో భాగంగా ఈ నెల 8న రెండో దశలోని 5.5 కిలో మీటర్ల మార్గానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్​లో ప్రస్తుతం మెట్రో రైలు మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది.

మెట్రో రెండో దశ కొత్త మార్గాలపై అధికారుల మేధోమథనం - చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ జంక్షన్!

మెట్రో రైలు రెండో దశ : మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ ఉంది. కాగా ఈ 5.5. కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్ నుమాకు చేరుకోవచ్చు. కారిడార్ 4, 5, 6, 7 మార్గాల్లో రూట్ మ్యాప్​ను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడనేది వెల్లడించాల్సి ఉంది.

భాగ్య నగరంలో మెట్రో రైలు రెండో దశ కొత్త మార్గాల ప్రతిపాదనలపై ఆదివారం మేధోమథనం జరిగింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ (HAML) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ నిపుణులు, దీనిపై మెట్రో సీనియర్‌ అధికారులతో మెట్రోరైలు భవన్‌లో విస్తృతంగా చర్చించారు. ప్రతిపాదిత కొత్త మార్గాల్లో సవాళ్లు, సంక్లిష్టతలు, సాధ్యమయ్యే సాంకేతిక పరిష్కారాలపై సమాలోచనలు ఈ సమావేశంలో జరిపారు.

'రెండో దశ మెట్రో రైలు విస్తరణ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంటుంది'

మార్గంపై స్పష్టత కోసం : నాగోల్‌, ఎల్బీనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఒక మార్గం ప్రతిపాదన ఉంది. నాగోల్‌, ఎల్బీనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్‌ కొత్త హైకోర్టు(New High Court) అనుసంధానంగా మరో మార్గం ఉంది. ఇందులో ఏ మార్గాన్ని ఎంపిక చేయాలి, ఎలా చేయాలనే దానిపై నిపుణులతో చర్చించారు. ఫలన్‌నుమా నుంచి 1.5 కి.మీ.పొడిగింపు ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్లు మార్గాన్ని, చాంద్రాయణగుట్ట వరకు మరో 1.5 కిలో మీటర్లు పొడిగిస్తే విమానాశ్రయ మెట్రోకు అనుసంధానం అవుతుంది. చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌ వస్తుంది. ఇక్కడ ఇరుకైన రహదారి, ఫ్లైఓవర్‌ ఉండటంతో మెట్రో రైలు రివర్సల్‌, స్టేబ్లింగ్‌ లైన్ల ఏర్పాటులో ఉన్న సంక్లిష్టతలు, సాధ్యమయ్యే సాంకేతికత పరిష్కారాలపై ప్రధానంగా చర్చ జరిపారు.

మెట్రో రెండోదశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం: ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ప్రయాణికుల నుంచి మెట్రో రైలు అధిక ఛార్జీలు వసూలు చేసింది : కాగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.