Hyderabad Liberation Day : కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే (Hyderabad Liberation Day )నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో తెలిపింది. భారత్ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్ సంస్థానం 13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉందని పేర్కొంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ఆపరేషన్ పోలోతో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైందని వెల్లడించింది.
Central Govt on Hyderabad Liberation Day : సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో వివరించింది. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.
Telangana Liberation Day 2022 : బందూకులెత్తారు.. బరిగీశారు..