Hyderabad Food Blogger Kiran Sahoo Success Story : రాష్ట్రం వేరైనా భాష వేరైనా ఆహారపు అలవాట్లు పూర్తిగా భిన్నమైనా సరే వంటలపై తనకున్న అవగాహనను అందరితో పంచుకోవాలి అనుకుంది ఈ యువతి. చిన్నప్పటి నుంచి రకరకాల ఆహారం తిని వాటి గురించి నలుగురికీ చెప్పే అలవాటు ఉండేది. అలా ఆసక్తితో మొదలైన అలవాటు ఫుడ్ వ్లాగింగ్ వైపు అడుగులు వేసేలా చేసింది. అనతికాలంలోనే తన ప్రతిభతో సామాజిక మాద్యమాల ద్వారా లక్షల్లో ఫాలోవర్స్‌ని సంపాధించగలిగింది ఈ యువతి.
మీరు చూస్తున్న ఈ యువతి పేరు కిరణ్ సాహు. ఒడిశాకు చెందిన ఈమెకు చిన్నప్పటి నుంచి వంటలు, వాటి రుచులు అంటే అమితమైన ఆసక్తి. చదువులోనూ మంచి ప్రతిభ కనబరిచిన ఈ యువతి ఎంబీఏ పూర్తి చేసింది. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి ఐటీ కొలువు సాధించింది. అంతే కాదండోయ్ వంటలపై తనకున్న పట్టుతో సుమారుగా 8 సంవత్సరాల నుంచి ఫుడ్‌వ్లాగర్‌గా దూసుకెళ్తూ శభాష్ అనిపిస్తోంది.
Yuva Special Story On Food Vlogger : ఉద్యోగం చేస్తూనే ఇక్కడి వంటకాలను సంస్కృతిని ప్రజలకు తెలియజేయాలనుకుంది కిరణ్‌సాహు. తన ప్రతిభతో 3 అవార్డులను సొంతం చేసుకోవటమే కాకుండా హైదారాబాద్‌లో టాప్ 10 ఫుడ్ వ్లాగర్స్‌లో ఒకరిగా రాణిస్తోంది. బ్లూ బటర్ ఫ్లై డిజిటల్ అనే సంస్థను స్థాపించి 17 కంపెనీలకు వ్లాగర్స్‌ను అందిస్తోంది. అలాగే ఈ ఫీల్డ్ అనుకున్నంత సులువుగా ఏమీ ఉండదని చెబుతోంది. నిత్యం బయట తినే ఆహరంతో ఆర్యోగం పాడవకుండా ఉద్యోగాన్ని, ఆరోగ్యాన్ని బాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాని చెబుతోంది. ఒకవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే అనేక మందికి ఆకలి తీర్చుతోంది కిరణ్‌సాహు. రివ్యూల కోసం ఆర్డర్ చేసిన ఆహారాన్ని వృధా చేయకుండా నిరుపేదల కడుపు నింపుతోంది.
ఉద్యోగం కంటే ముందు రన్నర్‌గా, బాస్కెట్ బాల్, బాడ్మింటన్ క్రీడాకారిణిగాను జాతీయ స్థాయిలో రాణించిన ఈ యువతి పుడ్ వ్లాగర్‌గానే తనకు ప్రతేకమైన గుర్తింపు దక్కిందని చెబుతోంది. ఇలా బహుళ పాత్రలు పోషిస్తూ విజయ పథంలో దూసుకెళ్తోంది ఈ యువతి. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఆటు పోట్లు ఎదురైనా కిరణ్‌సాహు వెనుకంజ వేయలేదు. ఇన్‌స్టాగ్రాం అందుబాటులో లేని రోజుల్లో కూడా వేరే మాద్యమాల ద్వారా ప్రజలతో సమాచారాన్ని పంచుకునేది. అలా ఒడిశా అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రజలకు దగ్గర కాగలిగింది.
YUVA : వినూత్నంగా భూగర్భశాస్త్రంపై పరిశోధన - ఆరేళ్ల సాధనకు పీహెచ్‌డీలో పట్టా
YUVA : ఫుట్‌బాల్ టీమ్‌కు యువ డాక్టర్ సేవలు - నాలుగు తరాలుగా వైద్యరంగంలోనే ఆ కుటుంబమంతా