ETV Bharat / state

త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయాలన్నీ వెల్లడిస్తాం : సీపీ కొత్త కోట శ్రీనివాస్​రెడ్డి - Hyderabad CP on Phone Tapping

author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 8:20 PM IST

TS Phone Tapping Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోందని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. త్వరలో కేసుకు సంబంధించిన విషయాలన్నీ వెల్లడిస్తామని తెలిపారు. కోర్టు అనుమతితో ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​కు రెడ్​ కార్నర్​ నోటీసులు జారీ చేస్తామని అన్నారు.

Telangana Phone Tapping Case Updates
TS Phone Tapping Case Updates (Etv Bharat)

Telangana Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోనసాగుతుందని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్​రెడ్డి వెల్లడించారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన అన్నీ వివరాలను మీడియాకు వెల్లడిస్తామన్నారు. న్యాయస్థానం అనుమతిస్తే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిందితులు ఆధారాలను ధ్వంసం చేసినా దర్యాప్తు బృందం వాటిని సేకరించారన్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.

Phone Tapping with WhatsApp groups : మరోవైపు ఈ కేసు దర్యాప్తులో పలు కొత్త విషయాలు బయటకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కేఎంఆర్​ వాట్సప్​ గ్రూప్​ పేరిట కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ ప్రత్యర్థులు కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డిపై నిరంతరం నిఘా ఉంచారని దర్యాప్తులో తేల్చారు. ఎస్​ఐబీ మాజీ డీఎస్సీ ప్రణీత్‌ రావు నేతృత్వంలో ప్రత్యేకంగా కేఎంఆర్​ పేరిట వాట్సప్​ గ్రూప్​ క్రియేట్​ చేసి ఎప్పటికప్పుడు రేవంత్‌ రెడ్డి, వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుల కదలికలను పరిశీలిస్తూ గ్రూపులో చర్చించుకునే వారని దర్యాప్తులో గుర్తించారు.

అంతేకాకుండా పోల్-2023 పేరిట వాట్సప్​ గ్రూప్​ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతల కదలికలపై అదనపు ఎస్పీ తిరుపతన్న నేతృత్వంలో నిఘా ఉంచారని నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చారు. ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావును ఏ1-గా, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావును ఏ6-గా చేరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు.

ఈ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌ పరారీలో ఉన్నట్లు న్యాయస్థానానికి దర్యాప్తు బృందం వెల్లడించింది. ఇప్పటివరకు నిందితుల వాంగ్మూలాల్లో వీరిద్దరి ప్రస్తావన వచ్చినా, సాంకేతిక కారణాలతో పేర్లను చేర్చలేదు. కానీ వీరు పరారీలో ఉన్న నిందితులుగా చూపడం చర్చనీయాంశంగా మారింది.

'ఫోన్​ ట్యాపింగ్​ కేసును పునాది నుంచి తీసుకొస్తున్నాం. ఈ కేసు కోర్టులో ప్రాసెస్​ జరుగుతోంది. రెడ్​ కార్నర్​ నోటీసులతో పరారీలో ఉన్న నిందితులను రప్పిస్తాం. ఆధారాలను ధ్వంసం చేయాలని నిందితులు ఎంత కష్టపడినా మేం వాటిని సేకరించాం. ఈ కేసులో ఎవరు ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు చేపడతాం'- కొత్త కోట శ్రీనివాస్​రెడ్డి, హైదరాబాద్​ సీపీ

త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయాలన్నీ వెల్లడిస్తాం : సీపీ కొత్త కోట శ్రీనివాస్​రెడ్డి (Etv Bharat)

ఆపరేషన్ 'పోల్​ 2023 - కేఎంఆర్' - ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరిన్ని కొత్త విషయాలు - Telangana Phone Tapping Case

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కీలక నిర్ణయం - ప్రభాకర్‌రావు అరెస్టుకు కోర్టులో పిటిషన్‌ - Phone Tapping Case Update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.