ETV Bharat / state

వంట ఆలస్యమైందని భార్యను చంపేసిన భర్త - ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి? - Husband Killed Wife - HUSBAND KILLED WIFE

Husband Killed Wife For Delay in Cooking in Hyderabad : బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వంట విషయంలో భార్యాభర్తల మధ్య రాజుకున్న గొడవ ప్రాణాలు తీసే వరకు చేరింది. వంట ఆలస్యంగా చేసిందనే కోపంతో ఇటుక రాయి తీసుకుని భార్య తలపై కొట్టాడు ఆ భర్త. ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన హైదరాబాద్​లో జరిగింది.

husband_killed_wife
husband_killed_wife
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 2:01 PM IST

Husband Killed Wife in Hyderabad : ఎంతో అన్యోన్యంగా జీవించే ఆ జంట బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. రాగానే ఇక్కడ ఓ పనిలో కుదిరారు. ఇద్దరు పిల్లలను తమ సొంతూళ్లో వదిలేసి, నెలల పసికందును వెంట పెట్టుకుని భాగ్యనగరానికి వచ్చి నాలుగు రోజులైనా కాలేదు అప్పుడే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో భర్త భార్య తలపై ఇటుకరాయితో బాదడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నెలల పసికందుతో పాటు మరో ఇద్దరు ఆడబిడ్డలు తల్లిలేని వారైపోయారు. ఈ ఘటన నగరంలోని కూకట్​పల్లి సమీపంలోని ప్రగతినగర్​లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మహారాష్ట్రకు చెందిన రవీనా దూబే(26), నవీన్​ దుర్వే దంపతులు ఈ నెల 26న భాగ్యనగరానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. ప్రగతి నగర్​లోని ఓ కళాశాల వసతి గృహం సమీపంలో గుడిసెలో తాత్కాలికంగా నివాసమున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలను సొంతూరులోనే ఉంచి ఏడాది వయసున్న బాబుతో హైదరాబాద్​కు వచ్చారు. సోమవారం సాయంత్రం భార్యాభర్తలు బయటకు వెళ్లి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చారు.

husband_killed_wife
వంట ఆలస్యమైందని భార్యను చంపేసిన భర్త - ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి?

మద్యం తాగొచ్చి వేధింపులు - భర్త గొంతు కోసి రాడ్డుతో కొట్టి చంపిన భార్య

Husband Killed His Wife Delay Preparing Dinner in Telangana : ఇంటికి తిరిగి వచ్చిన తరవాత వంట త్వరగా చేయమని నవీన్​ తన భార్యకు చెప్పాడు. కాసేపటి తరవాత మరికొంత తొందరపెట్టాడు. ఆమె కొంత ఆలస్యం చేసింది. ఈ విషయంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త గుడిసె ఆవరణలో ఉన్న ఇటుక రాయిని తీసుకొని భార్య తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

మద్యం తాగొచ్చి దాడికి తెగబడ్డ భర్త- చేతిలోని గొడ్డలి లాక్కుని నరికి చంపిన భార్య

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. రవీనా మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికులను ఆరా తీశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో ఉన్న వారి కుటుంబం, బంధువులకు సమాచారం అందించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కుటుంబ కలహాలు - మద్యం మత్తులో ఉన్న భర్తని హత్య చేసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.