Huge Tunnel Discovered in Mango Farm : నంద్యాల జిల్లాలో పంట పొలంలో ఓ సొరంగం బయటపడింది. బేతంచర్ల మండలం ఎంబాయి గ్రామానికి చెందిన రైతు శేఖర్ తన పొలంలో మామిడి పంటను సాగు చేశారు. ప్రస్తుతం మామిడి చెట్లు తొలగించి వేరే పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓ చెట్టును తొలగిస్తుండగా సొరంగం బయట పడింది. ఆ సొరంగం బెలూం గుహలను పోలి ఉంది. అంతా చీకటిగా ఉండటంతో లోపలికి వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. ఈ సొరంగాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఆ పంట పొలంలోకి చేరుకుంటున్నారు.
70 ఏళ్ల ఏజ్‌లో 88 అడుగుల సొరంగం తవ్విన పెద్దాయన- ఎందుకో తెలుసా? - Man Built Tunnel