Huge Number Of Beneficiaries Are Bookings For Free Gas Cylinder : దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల (దీపం-2) పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 1న ప్రారంభించగా నాటి నుంచి 5వ తేదీ (మంగళవారం) వరకు రాష్ట్రవ్యాప్తంగా 20,17,110 మంది లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు. అందులో 11,84,900 మందికి సిలిండర్లు డెలివరీ చేశారు. అనంతరం వీరి ఖాతాల్లో రూ.18 కోట్ల మేర సబ్సిడీని ప్రభుత్వం జమ చేసింది. అయితే సిలిండర్ బుక్ చేసుకున్నవారికి 48 గంటల్లోపు డెలివరీ చేయాల్సి ఉండగా రోజూ లక్షల సంఖ్యలో బుకింగ్‌లు వస్తుండటంతో గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. దీంతో సిలిండర్ల డెలివరీ ఆలస్యమవుతుం లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలా - ఈ కార్డులు తప్పనిసరి
AP Free Gas Cylinder Scheme : రాష్ట్రంలో దీపం 2.0 కింద ఉచిత సిలిండర్ పథకానికి బుకింగ్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 31వ తేదీ నుంచి సిలిండర్లూ అందిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులతో పోలిస్తే అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నామని వాటి వివరాలు లేకపోవడంతోనే అర్హుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
EKYC Mandatory Free LPG Cylinder : ఏపీలో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తాత్కాలిక అంచనా ప్రకారం 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్‌కు అర్హత పొందాయి. కానీ, రేషన్ కార్డులు 1.48 కోట్లు ఉన్నాయి. కొంత మందికి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా ఆధార్ కార్డు ఇవ్వకపోవడంతో అర్హత పొందలేకపోయారు. వీరంతా ఆధార్ అనుసంధానించుకుంటే దీపం 2.0 పథక అర్హుల సంఖ్య పెరుగుతుంది.
ఈ కేవైసీ తిప్పలు : సిలిండర్ రాయితీ పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరి అని ఇంధన సంస్థల డీలర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు పెద్దఎత్తున గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్తుండటంతో రద్దీ తలెత్తుతోంది.
ఊరూవాడ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ - ఇంటికెళ్లి అందించిన నేతలు
వంటింట్లో వెలుగుల "దీపం" - ఉచిత గ్యాస్ అమలుపై సర్వత్రా హర్షాతిరేకాలు