Huge Donations to CMRF AP : వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ. 5 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ తరఫున పెండ్యాల అచ్యుత రామయ్య రూ. 2 కోట్లు ఇచ్చారు. విక్రం నారాయణ రావు కుటుంబ సభ్యులు కోటి 55 లక్షలు, వసుధా ఫార్మా తరఫున వెంకటరామరాజు కోటి, ఏఎంఆర్ గ్రూప్ (AMR Group) తరఫున మహేశ్వరరెడ్డి మరో కోటి రూపాయల చెక్కు ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అక్కినేని వెంకట్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, క్రెడాయ్ తరఫున వైవీ రామారావు రూ. 50 లక్షల చెక్కులను సీఎంను కలిసి అందించారు. పత్తికొండ నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యే కెఈ శ్యామ్‌బాబు రూ 2.30 కోట్లు చెక్కు అందజేశారు.
వరద బాధితులకు పోలీసుల సాయం-ఒకరోజు వేతనం 12 కోట్ల విరాళం - Huge Donations to CMRF AP
Donations to Flood Victims : మైసూరుకు చెందిన గణపతి సచ్చిదానంద ఆశ్రమం రూ. 25 లక్షలు, కోనేరు విమలాదేవి రూ. 25 లక్షలు, కోనేరు ప్రదీప్ రూ. 25 లక్షలు, ఆర్కే ఇన్ ఫ్రా కార్పొరేషన్ తరఫున రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రూ. 20 లక్షలు ఇచ్చారు. సినీ హీరో జొన్నలగడ్డ సిద్ధార్థ రూ. 15 లక్షలు, ఫ్రాంక్విన్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 15 లక్షలు, మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ద్వారా ది కాంట్రాక్ట్ క్యారేజీ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రూ. 15 లక్షలు సీఎంకు అందించారు.
వరద బాధితులకు విరాళాల వెల్లువ- స్ఫూర్తిదాయకమని సీఎం అభినందనలు - Huge Donations To CMRF AP
సీఎంకు చెక్కులు అందించిన దాతలు : అన్నమయ్య జిల్లా తరఫున తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి రూ. 15 లక్షలు ఇచ్చారు. సింహా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 10,00,116 అందించింది. సినీ హీరో విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు, బొబ్బా గోపాలకృష్ణ, పువ్వాడ సుధాకర్, వాస్తవ్య ప్రమోటర్స్ అండ్ డెవలెపర్స్ రూ. 10 లక్షలు ఇచ్చారు. వికాస్ పబ్లిక్ స్కూల్, విశ్వం ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీ రష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ , కోగంటి వెంకటరామయ్య , డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి రూ. 5 లక్షల చొప్పున సీఎంకు అందించారు. వాసిరెడ్డి సుగుణ కుమారి రూ. 3 లక్షలు, ఎన్టీఆర్ కుటీరం తరఫున ఆర్. శివాజీ రూ. లక్ష అందించారు. మానవత్వం చాటిన వారందరినీ సీఎం అభినందించారు.