ETV Bharat / state

కోనసీమలో జనజాతర - చంద్రబాబు, పవన్‌ సభలో జనాలే జనాలు - Prajagalam Meeting

Huge Crowd on Chandrababu and Pawan Meeting: ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనసీమ వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంబాజీపేట, అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలకు జనం వేలాదిగా తరలివచ్చారు. చంద్రబాబు, పవన్‌ ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది.

prajagalam_meeting
prajagalam_meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 9:08 AM IST

Updated : Apr 12, 2024, 10:02 AM IST

కోనసీమలో జనజాతర - చంద్రబాబు, పవన్‌ సభలో జనాలే జనాలు

Huge Crowd on Chandrababu and Pawan Meeting: రాజకీయ చైతన్యానికి మారుపేరైనా కోనసీమ జనజాతరను తలపించింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభకు జనం భారీగా తరలిరావడమే కాకుండా వారితో గొంతు కలిపారు. నేతలిద్దరి ప్రసంగాలకూ స్పందించారు. చంద్రబాబు వేసిన ప్రతి ప్రశ్నకూ స్పందించి సమాధానాలు చెప్పారు. చుట్టూ ఉన్న జనం చేతులెత్తి ఉత్సాహంతో జజ్జనకరి జనారే అంటూ ఊగారు. సభ ముగిసి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ వారాహి వాహనం దిగిన తర్వాత అక్కడ వినిపించిన పాటకు వేదిక ముందు యువత నృత్యాలు చేస్తూనే ఉన్నారు.

కోనసీమను వైసీపీ కలహాల సీమగా మార్చే యత్నం చేసింది- పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan at Prajagalam

పి.గన్నవరం నియోజకర్గంలోని అంబాజీపేట, అమలాపురంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సభలు నిర్వహించారు. అంబాజీపేట సభకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకే జనం చేరుకున్నారు. మిద్దెలు, మేడలు, డాబాలు, ఇళ్ల వద్దకు పెద్దఎత్తున జనం చేరుకున్నారు. ఆ వేదిక చుట్టూ ఉన్న భవనాలన్నీ జనంతో నిండిపోయాయి. మహిళలు విద్యుత్‌ తీగల సమీపంలోనే నిలుచుని నాయకులను చూసేందుకు ప్రయత్నించడంతో విద్యుత్తును నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రోడ్డుకు ఇరువైపులా వారాహి వాహనాన్ని ఆనుకుని ప్రజలు కిక్కిరిసిపోయారు. రెండు సభల్లో చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తూ వాటిపై ప్రశ్నలు వేశారు. ప్రతి ప్రశ్నకూ జనం నుంచి మంచి స్పందన రావండతో చాలాసేపు బాబు అలానే కొనసాగించారు. చంద్రబాబు తన ప్రసంగం చివర్లో హలో ఏపీ అంటే సభికులంతా బైబై జగన్‌ అంటూ పెద్దఎత్తున నినదించారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు పెట్టింది పేరైన కోనసీమలో వారి ఉ‌త్సాహం మిన్నంటింది.

కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు చేయుత- అంబాజీపేటలో చంద్రబాబు - Chandrababu Naidu Election Campaign

Chandrababu Comments: ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీల 27 పథకాలు రద్దు చేశారని, దుర్మార్గ పాలన వస్తే ఎస్సీలను చంపి డోర్‌ డెలివరీ చేస్తారని తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం డిక్లరేషన్‌ తీసుకువస్తామని అన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు కొబ్బరి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదని, సిద్ధం సిద్ధం అంటున్న వారికి యద్ధం ఇద్దామని పవన్‌ చెప్పారని గుర్తు చేశారు. మూడు జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటేనని, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయమని అన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

విద్వేషాలు రెచ్చగొట్టు, సానుభూతి పట్టు - ముఖ్యమంత్రి జగన్​ మొసలి కన్నీరు ! - YCP Sympathy Politics

Pawan Kalyan on YS Jagan: సీఎం జగన్ కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు యత్నించారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. తాము మాత్రం కోనసీమను ప్రేమ సీమగా మార్చేందుకు యత్నించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది కోసం త్రివేణి సంగమంలా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తోందని పవన్‌ వెల్లడించారు. వైసీపీ నుంచి ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇది రైతు కన్నీరు తుడిచే కూటమి అవుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారని ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Last Updated : Apr 12, 2024, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.