Drugs seized in Telangana: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో డీఆర్‌ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లారీలో తరలిస్తున్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. డ్రగ్స్ విలువ రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం. ఏపీలోని ఓడరేవు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన డ్రగ్స్ చిరాగ్‌పల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
బిగ్గెస్ట్ డ్రగ్స్ ఆపరేషన్- అండమాన్ తీరంలో 6వేల కిలోల మెథ్ స్వాధీనం- విలువ రూ.కోట్లలోనే!