ETV Bharat / state

టిడ్కో ఇళ్లకు హడ్కో చేయూత- రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు హామీ - Tidco Houses in ap - TIDCO HOUSES IN AP

Hudco Agreed Give Loans Construction of Tidco Houses in AP : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్​లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో సమ్మతించింది. గత వారంలో రెండు రోజుల పాటు టిడ్కో అధికారులతో హడ్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే టిడ్కో ఇళ్లను పూర్తి చేయడానికి రుణం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

tidco_houses_ap
tidco_houses_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 8:47 AM IST

Hudco Agreed Give Loans Construction of Tidco Houses in AP : రాష్ట్రంలో పెండింగులో ఉన్న టిడ్కో గృహాల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది. ఈ మేరకు టిడ్కో అధికారులకు హడ్కో ప్రతినిధుల హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రూ.5,070 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై సమగ్ర నివేదికను రెండు రోజుల్లో హడ్కోకు సమర్పించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగులో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో (హౌజింగ్‌ అండ్ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) సమ్మతం తెలిపింది. గత వారంలో రెండు రోజుల పాటు టిడ్కో అధికారులతో భేటీ అయిన హడ్కో ప్రతినిధులు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటివరకు టిడ్కో ఇళ్లు ఎంత మేర పూర్తయ్యాయి? ఎన్ని ఏఏ దశల్లో ఉన్నాయి? మొత్తం ఇళ్ల పూర్తికి ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలను సమగ్రంగా నివేదిక రూపంలో అందించాలని హడ్కో అధికారులు కోరారు. అధికారులు దీనిపై కసరత్తు పూర్తి చేసిన రెండో రోజుల్లో మొత్తం వివరాలతో నివేదికను హడ్కోకు అందించనున్నారు.

'6 నెలల్లో టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తాం' - హిందూపురంలో నందమూరి బాలకృష్ణ - Balakrishna Inspected TIDCO Houses

వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న పరపతి : సీఎం జగన్​ పాలనలో అనుసరించిన విధానాల వల్ల రాష్ట పరపతి పూర్తిగా దెబ్బ తినడంతో టిడ్కో ఇళ్లను పూర్తి చేయడానికి ఏ బ్యాంకు ముందుకు రాలేదు. రుణం కోసం ఎన్నికలకు మందు హడ్కోను రెండేళ్లపాటు సంప్రదించిన అక్కడ కూడా మొండి చేయి ఎదురైంది. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి అధికారులు హడ్కోతో సంప్రదింపులు ప్రారంభించారు. మొదట్లో రూ. 2000 కోట్ల రుణం కోసం అధికారులు ప్రయత్నించారు. తాజాగా జరిగిన భేటీ అనంతరం మొత్తం నిర్మాణ వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో సమ్మతించింది.

తొలగిపోతున్న అడ్డంకులు - టిడ్కో ఇళ్లకు హడ్కో రుణం - Tidco Houses in AP

రూ.5,070 కోట్లు అవుతుందని అంచనా : గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 3.14 లక్షల టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 52 వేల గృహాలను రద్దు చేసింది. 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల నాటికి 1.45 లక్షల ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించింది. ఇందులో మెజారిటీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% పైగా పూర్తి చేసినవే. ఇంకా లక్షా 17 వేల ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకుగాను రూ.5 వేల70 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

గుడివాడలో వైఎస్సార్సీపీ అక్రమాలు - టిడ్కో ఇళ్ల పేరుతో భారీగా దోపిడీ - Irregularities in Amrit Scheme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.