ETV Bharat / state

Fog Alert: చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్ - జీవితాంతం చల్లగా ఉండొచ్చు - HOW TO AVOID ROAD ACCIDENTS

ఏటా శీతాకాలంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - ఆ సమయంలో ప్రయాణాలు మంచిది కాదంటున్న నిపుణులు

How to Avoid Road Accidents Due to Fog
How to Avoid Road Accidents Due to Fog (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

How to Avoid Road Accidents Due to Fog : రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తెల్లవారుజామున దట్టంగా పొగ మంచు కమ్ముకుంటోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ( Road Accidents With Fog) జరుగుతున్నాయి. డిసెంబరు, జనవరి నెలల్లో పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎన్‌సీఆర్‌బీ (National Crime Statistics Agency) నివేదిక ప్రకారం 2022లో పొగ మంచు కారణంగా ఏపీలో 1,656 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 661 మంది మృతి చెందగా, 1647 మంది గాయలపాలయ్యారు. ఈ సందర్భంగా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, నిపుణులు సూచనలు చేస్తున్నారు.

Safe Driving Tips in Winter : క్రిస్మస్, న్యూ ఇరర్, సంక్రాంతి పండగల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారు సొంత ఊళ్లకు వస్తుంటారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు, సరదాగా సమయం గడిపేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి విహారయాత్రలకూ ప్రయాణాలు చేస్తుంటారు. ట్రాఫిక్‌ సమస్య ఉండదు అని, వేగంగా వెళ్లవచ్చనే ఉద్దేశంతో పలువురు రాత్రి టైంలో ప్రయాణాలు చేస్తున్నారు. అదే సమయంలో జాతీయ రహదారులపై పొగ మంచు కారణంగా మార్గం సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మంచు కురిసే వేళ డ్రైవింగ్ చేస్తున్నారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమే!

దేశంలో ప్రతీ సంవత్సరం శీతాకాలంలో పొగ మంచు కారణంగా సగటున 30 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా రాజ్యసభలో వెల్లడించిన వివరాలు ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

సంవత్సరంప్రమాదాలు
201935,062
202026,541
202128,934
202234,262

ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు : -

  • అర్ధరాత్రి తర్వాత, ఉదయం 8 గంటలలోపు దూర ప్రయాణాలు చేయవద్దు.
  • రాత్రి సమయాల్లో గంటకు 40 నుంచి 50 KM వేగంతో మాత్రమే ప్రయాణం చేయాలి. వాహనం వేగం పెరిగే కొద్దీ ఎక్కువ దూరం చూడలేరు. రహదారిని చూడగలిగే పరిస్థితులకు అనుగుణంగా వేగం
  • తగ్గించాలి.
  • వాహనం నడిపేటప్పుడు ఇతరులకు స్పష్టంగా కనిపించేలా లైట్లు ఆన్‌ చేసి ఉంచాలి. ఇతర వాహనాలు మిమ్మల్ని గమనించేలా హజార్డ్‌ లైట్‌ (Hazard Light) వాడాలి. లోబీమ్‌ ఫాగ్‌ లైట్లు ఉండేలా చూడాలి.
  • నేషనల్ హైవే, శివారు రహదారులపై వాహనాల మధ్య కచ్చితంగా దూరం పాటించాలి.
  • వాహనాలు అద్దాలపై మంచు పొరను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
  • రహదారి స్పష్టంగా కనిపించకపోతే సురక్షితమైన స్థలంలో వాహనాన్ని ఆపాలి. మీ వాహనం ఇతర వాహనదారులకు కనిపించేలా ఉండాలి.
  • మీ ముందు వెళ్లే వాహనాలను అధిగమించే ప్రయత్నం చేయకూడదు.
  • వాహనం డ్రైవ్ చేస్తూ తాగడం, తినడం, పొగ తాగడం అస్సలు చేయకూడదు. డ్రైవింగ్‌పైనే ఫోకస్ చేయాలి.

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? చుండ్రు​ సమస్య వెంటాడుతోందా? ఈ టిప్స్ మీకోసమే!

వింటర్​ సూపర్​ ఫుడ్​.. మీ డైట్​లో తప్పక ఉండాల్సిన డ్రైఫ్రూట్స్ ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.