ETV Bharat / state

'డిస్కౌంట్​' అనగానే క్లిక్​ చేస్తున్నారా? - 'బుక్' అయిపోతారు జాగ్రత్త - How to Avoid Online Shopping Frauds - HOW TO AVOID ONLINE SHOPPING FRAUDS

Online Shopping Scam : ప్రస్తుతం పండుగ వచ్చిందంటే చాలు జనాలంతా ఒకేవైపు చూస్తారు. అదే ఆన్​లైన్​ షాపింగ్​. మార్కెట్​ రేటు కన్నా భారీ డిస్కౌంట్లకు వస్తువులు వస్తాయని కొనుగోలు చేస్తుంటారు. ఈ ఒక్క కారణాన్ని అవకాశంగా తీసుకొని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ-మెయిల్​, మెసేజ్​ల​ ద్వారా తప్పుడు సందేశాలు పంపుతూ భారీగా దోచుకుంటున్నారు. మరి అలాంటి మోసాల నుంచి ఎలా బయటపడాలో బ్యాంక్​ బజార్​.కామ్​ చెబుతుంది. మరి ఆ టిప్స్​ ఏంటో చూద్దామా.

Online Shopping Scam
Online Shopping Scam (ETV Bharat)
author img

By ETV Bharat Business Team

Published : Sep 27, 2024, 10:46 AM IST

How to Avoid Online Shopping Frauds : చాలా మంది కొనుగోలుదారులు కొన్ని రోజులుగా వెయిట్​ చేస్తున్న దసరా పండుగ సీజన్​ వచ్చేసింది. దీంతో ఈ- కామర్స్​ సంస్థలు అన్ని చాలా బిజీబిజీగా కస్టమర్స్​ కొనుగోళ్లతో గడిపేస్తున్నాయి. ఎందుకంటే ఈ-మార్కెట్​లో వస్తువు ధర మార్కెట్​లో ఉన్న రేటు కంటే భారీ తగ్గింపు ధరలకు ఇస్తుంటారు. ఎక్కువ మొత్తంలో వస్తువులు ఉండటం, కొనుగోలుదారులు అదే స్థాయిలో ఉండటంతో కొన్ని ఈ-కామర్స్​ సంస్థలు ముందుగానే సేల్​ విషయంలో వారికి ఈ కామర్స్​ యాప్స్​ నుంచి నోటిఫికేషన్​ పంపిస్తాయి. ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకొని సైబర్​ నేరగాళ్లు గోల్​మాల్​కు పాల్పడుతున్నారు. ఒక వస్తువు పరిమితంగానే ఉందని, దాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే ఆఫర్​ ఉండదని చెబుతూ మెయిల్స్​, మెసేజ్​లు పంపిస్తారు. ఇలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్​బజార్​.కామ్​ కొన్ని సూచనలు చేస్తోంది.

సైబర్​ నేరగాళ్ల పని : పండుగ వచ్చిందంటే చాలు దాదాపు 10 రోజుల నుంచి ఆన్​లైన్​ షాపింగ్స్​ సందడే కనిపిస్తుంది. మార్కెట్​ రేటు కన్నా అతి తక్కువ ధరలకే వస్తువులను అందిస్తామని చెబుతూ ఈ-కామర్స్​ సంస్థలు కస్టమర్స్​ను ఆకట్టుకునే పనిలో పడతాయి. ఈ భారీ డిస్కౌంట్​లను ఆసరాగా తీసుకొని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇవి కూడా భారీ తగ్గింపు ధరలే అని భ్రమపడేలా మనకు ఇ-మెయిల్​, సందేశాలు ఫోన్లకు వస్తుంటాయి.

ఉదాహరణకు చెప్పుకోవాలంటే సతీశ్​కు ఒక ప్రముఖ ఇ-కామర్స్​ సంస్థ నుంచి ప్రత్యేక తగ్గింపు ధర ఇస్తున్నట్లుగా ఇ-మెయిల్​ వచ్చింది. కానీ ఆ ఆఫర్​ కేవలం రెండు గంటలే అందుబాటులో ఉంటుందని, వస్తువులు సైతం పరిమితంగానే ఉన్నాయనేది దాని సారాంశం. ఈ సమాచారం చూసిన సతీశ్​ మంచి అవకాశం ఎందుకు మిస్​ చేసుకోవాలి. పైగా భారీ తగ్గింపు ధరలు ఉన్నాయని భావిస్తాడు. వెంటనే వచ్చిన సందేశం మెసేజ్​ లింక్​ ఓపెన్​ చేసి, తన క్రెడిట్​ కార్డు వివరాలు అన్నీ ఇచ్చేస్తాడు. కార్డు నుంచి డబ్బులు పోయిన ఎలాంటి కన్ఫర్మేషన్​ మెసేజ్​ రాలేదు. అప్పుడే సతీశ్​కు బాగా తెలిసింది. తాను మోసపోయానని, ఇలాంటి సంస్థలు ఏవీ ఆ ప్రముఖ ఇ-కామర్స్​ సంస్థ ఇవ్వడం లేదని.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి : పరిమిత కాలపు ఆఫర్లు అంటూ వచ్చే ఇ-మెయిల్​, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్​ బజార్​ హెచ్చరిస్తోంది. ఇలాంటి వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తోంది. వీటి విషయంలో కాస్త తొందరపాటుకు గురికాకుండా ఉంటేనే ఉత్తమం అని అంటున్నారు. వీరి ఇలాంటి ఇ-మెయిల్​, సందేశాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.

  • పరిమిత కాలం ఆఫర్లు అంటూ వచ్చే సందేశాలను అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి సందేహాలు కంపెనీలు పంపవు.
  • ఇ-మెయిల్​లో వచ్చిన లింకును ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. దీని బెస్ట్​ ఆప్సన్​ ఏంటంటే ఆయా సంస్థల అధికారిక వెబ్​సైట్లలోకి వెళ్లి ఆఫర్​ గురించి తెలుసుకోవడం మేలు.
  • చెల్లింపుల విషయానికొస్తే టు ఫ్యాక్టర్​ అథెంటికేషన్​(రెండంచెల భద్రత)ను వినియోగించాలి. దీనివల్ల అదనపు రక్షణ ఉంటుంది.
  • మోసపూరిత మెయిళ్లలో కంపెనీల పేర్లకు సంబంధించి అక్షర దోషాలు ఉంటాయి. వీటిని జాగ్రత్తతో గుర్తిస్తే సరిపోతుంది.
  • ఆఫర్ల గురించి ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకున్నాకే, కొనుగోలు చేసుకోవడం ఉత్తమ పద్ధతి. మోసపోయినట్లు గుర్తిస్తే, వెంటనే బ్యాంకుకు, సైబర్​ క్రైమ్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలి.
  • ఆన్​లైన్​ కొనుగోళ్లకు తక్కువ పరిమితి ఉన్న వాటిని వాడితేనే ఉత్తమం.

మీ అకౌంట్​లో డబ్బు జమ అయినట్లు మెసెజ్​ వచ్చిందా? - అది డమ్మీ కావొచ్చు, బ్యాలెన్స్ చెక్​ చేసుకోండి - Dummy Messages Cyber Crime in hyd

క్రెడిట్ కార్డ్ vs బై నౌ, పే లేటర్ ఆప్షన్- ఆన్‌లైన్ షాపింగ్‌కు రెండింట్లో ఏది బెటర్? - Buy Now Pay Later vs Credit Card

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.