Home Minister Anitha Sensational Comments on YS Jagan : తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టడం ఇష్టంలేక పర్యటన రద్దు చేసుకున్న జగన్ కుంటిసాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడని విమర్శించారు. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ తిరుమల లడ్డూ తినని జగన్ నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు : డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జగన్ చేశాడని అనిత దుయ్యబట్టారు. జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా దళితులకు అవకాశం ఇచ్చారా? అని మంత్రి నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తుచేశారు. హిందూ, దళితురాలైన తనకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనేనని విమర్శించారు. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందని అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్‌ను దేశ బహీష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహీష్కరణ చేయాలని పరిస్థితి జగనే తెచ్చుకున్నాడని అన్నారు.
జగన్ కథలు అల్లాడు : జగన్‌కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టి పక్కన పెట్టేయటం, అక్షింతలు వేస్తే తల దులిపేసుకోవటం లాంటి సందర్భాలు ఎన్నో చూశామన్నారు. నిన్న జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఒక్కరినైనా బైండోవర్ చేశామా? లేక గృనిర్బంధం చేశామా? అని నిలదీశారు. శాంతి భద్రతల పరిరక్షణకు సాధారణంగా అమల్లోకి తెచ్చే సెక్షన్ 30 యాక్ట్ తెస్తే అది కూడా తనకే జారీ చేసినట్లు జగన్ కథలు అల్లాడని దుయ్యబట్టారు. దేవుడైనా తన గుమ్మం ముందుకు రావలనుకునే తత్వం జగన్ ది కాబట్టే ఇంటి వద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నాడని మండిపడ్డారు. కల్తీ లడ్డు వ్యవహారంపై సాక్షి బృందంతో సిట్ వేసి దర్యాప్తు జరగాలని జగన్ కోరుకుంటున్నట్లు ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.