BSc Biomedical Science Honors Course : మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాల దృష్ట్యా బీఎస్సీలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ ఆనర్సు కోర్సును ప్రవేశపెడుతున్నట్టు స్ఫష్టం చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులకు పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో ఈ వృత్తివిద్యా కోర్సును ప్రారంభిస్తున్నట్టు స్ఫష్టం చేసింది.
ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ మహమూద్, ప్రొఫెసర్ శ్రీరాం, రెడ్డీస్ లేబొరేటరీస్, ఎంఎస్ఎన్ లేబొరేటరీస్, ఫార్మా డీఈఎం సొల్యూషన్స్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఉస్మానియా, నిమ్స్, మహావీర్ ఆస్పత్రుల సీనియర్ వైద్యులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు.
2024-25 విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకురానున్న ఈ కోర్సుకి సంబంధించిన సిలబస్‌ని ఇప్పటికే రూపొందించినట్టు వివరించారు. ఆస్పత్రులు, ఫార్మా సంస్థల సహకారంతో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, కోర్సు ప్రాక్టికల్స్‌ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఒప్పందాలు పూర్తి చేసుకున్నట్టు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు.
TSPSC Group 1 Prelims Exam Arrangements : మరోవైపు ఈనెల 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగబోయే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసి వేస్తామని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, నగలు, ఆభరణాలు తీసుకురావద్దని తెలిపింది. పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్నీ అనుమతించబోమంది. నిబంధనలను పాటించకున్నా, నిషేధించిన వస్తువులను తీసుకెళ్లినా, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా పోలీసు కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంది. పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టంచేసింది. ఇవీ మరిన్ని నిబంధనలు.
హాల్‌టికెట్‌ను ఏ4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. కలర్‌ప్రింట్ అయితే బాగుంటుంది. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్‌పోర్టు ఫొటోను అతికించాలి. ఫొటో పెట్టకుంటే అనుమతించరు.డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ఫొటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనీయరు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచాలి.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లలో స్వల్పమార్పులు - ఏంటంటే