ETV Bharat / state

దిశా ఎన్​కౌంటర్ కేసులో తెలంగాణ పోలీసులకు ఊరట - చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశం - Disha Encounter Case

Disha Encounter Case : దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో తెలంగాణ పోలీసులకు ఊరట లభించింది. ఈ ఘటనతో సంబంధమున్న పోలీసులు, షాద్​నగర్​ తహశీల్దార్​పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.

disha_encounter_case
disha_encounter_case
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 7:16 PM IST

Disha Encounter Case : దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది. ఈ ఘటనతో సంబంధమున్న పోలీసులు, షాద్​నగర్​ తహశీల్దార్​పై ఎటువంటి చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశించింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్​కౌంటర్​పై నిజనిజాలకు జస్టిస్ సిర్పూర్కర్​ కమిషన్​ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ను సుప్రీంకోర్టు నియమించింది. క్షేత్రస్తాయిలో పర్యటించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్, పలువురిని విచారించింది.

విచారణ అనంతరం ఎన్​కౌంటర్​ చేసిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ తమ నివేదికలో పేర్కొంది. దీనిపై స్పందించిన పోలీసులు నివేదిక సరిగ్గా లేదంటూ హైకోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసుల పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం, పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.