ETV Bharat / state

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు- స్పీకర్​ కార్యాలయానికి ఆదేశాలు - MLAS DISQUALIFICATION CASE - MLAS DISQUALIFICATION CASE

TG High Court on MLAs Disqualification Case : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

TG HC on MLAs Disqualification Case
TG HC on MLAs Disqualification Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 12:28 PM IST

Updated : Sep 9, 2024, 1:43 PM IST

MLA Defection Case in Telangana : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్టప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్​ను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి సైతం పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయినా స్పీకర్‌ పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. స్పీకర్​ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని, స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల విచారణను ముగించిన ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది.

హైకోర్డు తీర్పుతో ఉప ఎన్నిక‌లు త‌థ్యం : హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పు కాంగ్రెస్ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమని హరీశ్​రావు పేర్కొన్నారు. హైకోర్డు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టేలా ఉందని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం త‌థ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్​ఎస్​ గెలుపు త‌థ్యమని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా శాస‌న‌ స‌భాప‌తి నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నామని తెలిపారు.

'శ్రీశైలం దేవస్థానానికి సమాంతరంగా ప్రైవేట్ ట్రస్ట్ పేరుతో ఆలయ నిర్మాణమా?' - AP HC on Srisailam Temple Lands

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసుపై హైకోర్టు స్పందన ఇదే

Last Updated : Sep 9, 2024, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.