loopholes in Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా ఈ చట్టం గురించే విస్తృతమైన చర్చ. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని, స్వయంగా న్యాయ నిపుణులే చెబుతున్నారు. భూ కబ్జాదారులు, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని వివాదాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అవలీలగా కొట్టేసేందుకు వీలుంటుందని హెచ్చరిస్తున్నారు. నల్ల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు రోడ్డెక్కినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సాక్షాత్తూ సీఎం జగన్ అబద్ధాలు చెబుతూ, ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం పూర్వాపరాలు ఏంటి, దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే అంశాలు బెజవాడ బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సోము కృష్ణమూర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి కార్యక్రమం.
రాజ్యాంగ విరుద్ధంగా, నీతి ఆయోగ్ సిఫార్సులకు వ్యతిరేకంగా పలు వివాదాస్పద అంశాలతో గత అక్టోబర్ లో శాసన సభ లో చట్టాన్ని ఆమోదించి మరీ అమల్లోకి తెచ్చింది జగన్ సర్కార్. ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని న్యాయ వాదులే ప్రజల పక్షాన రోడ్డెక్కినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల్లో ప్రతిపక్షాలు సైతం వాస్తవాలను ప్రజలకు చెబుతున్నా వాటిని ప్రభుత్వం అంగీకరించడం లేదు. పైగా సాక్షాత్తూ సీఎం జగన్ సహా మంత్రులే రోజు కో మాట, పూటకో అబద్దం ఆడుతూ చట్టాన్ని సమర్ధిస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నా ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ఈ చట్టం చేసిన తీరు, పొందుపరచిన అంశాలను చదివితే ఎవరైనా వారి ఆస్తిపై ఆశ వదులు కోవాల్సిందే అంటున్నారు.
పని 'ఫుల్' జీతాలు 'నిల్' - దుర్భర పరిస్థితుల్లో క్లాప్ డ్రైవర్లు - Clap Auto Drivers Problems
న్యాయ నిపుణులు. బెజవాడ బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో యావత్ న్యాయవాదులంతా ఏకమై చట్టాన్ని రద్దు చేయాలని రోడ్డెక్కడం సహా హైకోర్టులో పిటిషన్ వేసి పోరాడుతున్నారు. ఇదే సమయంలో చట్టం అమల్లోనే ఉందని, అందరూ చెబుతున్నది వాస్తవమే అయినా, సాక్షాత్తూ సీఎం జగన్ ఈ చట్టాన్ని పక్కదారి పట్టిస్తూ అవాస్తవాలు ప్రచారం చేయడం దారుణమని బీబీఎ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సోము కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జాదారులకు, దోపిడీదారులకు అనువుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందని, ఈ చట్టం కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు తమ ఆస్తులపై ఆశ వదులు కోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. దీన్ని రద్దు చేయాలని హైకోర్టులో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్త పడి, భవిష్యత్తులో ఇలాంటి చట్టాలు తీసుకురాకుండా ఆలోచించి ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో మీకు తెలియకుండానే మీ ఆస్తులను అధికార పార్టీ నేతలు సులభంగా కబ్జా చేస్తారంటూ, చట్టంలో ఉన్న లోపాలను, ఆధారాలతో సహా ఈటీవీ భారత్తో ఆయన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
ఆంధ్రులారా తస్మాత్ జాగ్రత్త - ఇది జగన్ మార్కు దోపిడీ చట్టం - చూసుకోకుంటే మీ భూములు ఇక అంతే! - AP LAND TITLING ACT 2023