ETV Bharat / state

ఆరో తరగతి విద్యార్థిని లేఖకు స్పందించిన హైకోర్టు - బార్​ & రెస్టారెంట్​పై ప్రభుత్వానికి నోటీసులు - HC ISSUES NOTICE TO GOVT ON BAR - HC ISSUES NOTICE TO GOVT ON BAR

High Court Issues Notice to Govt to Relocate Bar and Restaurant : నివాసాల మధ్య అనుమతిచ్చిన ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బార్​ను మరోచోట మార్చాలని ఆరో తరగతి విద్యార్థిని రాసిన లేఖపై స్పందించిన న్యాయస్థానం, నాలుగు వారాల్లో కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

HC ISSUES NOTICE TO GOVT ON BAR
High Court Issues Notice to Govt to Relocate Bar and Restaurant
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 10:32 PM IST

High Court Issues Notice to Govt to Relocate Bar and Restaurant : నగరంలోని హయాత్‌నగర్ నుంచి సాహెబ్​నగర్ వెళ్లే దారిలో ప్రధాన రహదారిపై నివాసాల మధ్య సాయి యువ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆబ్కారీ, హోం శాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్ఎంసీ(GHMC), రాచకొండ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తమ కాలనీలో నివాసాల మధ్య ప్రధాన రహదారిపై సాయి యువ బార్ ఏర్పాటుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 6వ తరగతి విద్యార్థిని వైష్ణవి హైకోర్టుకు లేఖ రాసింది.

బార్‌కు 70 మీటర్ల దూరంలో విద్యా సంస్థలు : ఫిబ్రవరి 29న అందిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(Public Interest Litigation)గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ట్ అనిల్‌ కమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బార్‌కు 70 మీటర్ల దూరంలోనే పలు విద్యా సంస్థలున్నాయని లేఖలో పేర్కొంది. చుట్టూ పలు కాలనీలు ఉండటంతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుందని తెలిపింది. ఈ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్లలో సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు తరగతులు ఉంటాయని, ఈ సమయంలో పిల్లలను ఒంటరిగా పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని లేఖలో పేర్కొంది.

High Court Order for Counter File on Bar and Restaurant PIL : బార్‌కు ఎదురుగా శివాలయం ఉందని, గుడికి వెళ్లేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారని లేఖలో తెలిపింది. 30 శాతం మంది సీనియర్ సిటిజన్లు సాయంత్రమైతే పాల కోసం కూడా బయటికి రాలేకపోతున్నారన్నారని, ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులు, తాగుబోతుల వీరంగంతో సరైన నిద్రలేక సతమతమవుతున్నారని పేర్కొంది. లేఖను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా చేసింది.

ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు షాక్ - పిటిషన్​ను కొట్టివేసిన హైకోర్టు - SIB EX DSP Praneeth Rao Case

కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదు - కస్టడీ ఉత్తర్వుల్లో రౌజ్‌అవెన్యూ కోర్టు న్యాయమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.