ETV Bharat / state

టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి కేసులో విచారణ - కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తామన్న పోలీసులు - TDP MLA Eluri Sambasivarao

High Court Hearing on TDP MLA Eluri Case: గ్రానైట్‌ ఫ్యాక్టరీ తనిఖీ చేయకుండా ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నారన్న ఆరోపణలతో తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై నమోదు చేసిన కేసులో అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకుంటామని మార్టూరు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. న్యాయస్థానంలో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. వివరాలను నమోదు చేసిన హైకోర్టు అర్నెష్‌కుమార్‌ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలంటూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. 41ఏ నోటీసు ఇస్తామని పోలీసులు చెబుతున్నందున లోతుల్లోకి వెళ్లడంలేదని స్పష్టంచేసింది.

eluri_sambasivarao_case
eluri_sambasivarao_case
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 6:56 AM IST

టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి కేసులో విచారణ - కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తామన్న పోలీసులు

High Court Hearing on TDP MLA Eluri Case: విధులకు ఆటంకం, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో నెల్లూరు జిల్లా నిఘా విభాగం గనులు, భూగర్భశాఖ ఏడీ బాలాజీ నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన అనుచరులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులపై బాపట్ల జిల్లా మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిలు కోసం ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన విచారణలో 41ఏ నోటీసు ఇవ్వాల్సిన కేసులలోనూ పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామన్యుల పరిస్థితి ఏమిటని? హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తాజాగా పిటిషనర్ తరపున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కోర్టుకు వివరించారు.

ఇవాళ తప్పు చేసి రేపు తప్పించుకోగలరా? - ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్న కేసులలో అరెస్టు చేయడానికి వీల్లేదన్నారు. 41ఏ నోటీసు ఇవ్వాలన్నారు. ఆధారాలు లేకుండా దర్యాప్తు అధికారి అనుమానాలతో వ్యక్తులను అరెస్టు చేయడం కుదరదన్నారు. చట్టనిబంధనలకు వక్రభాష్యం చెబుతూ ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు. ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో పోలీసుల వద్ద సరైన కారణాలు, ఆధారాలు లేవన్నారు. నిందితులను మెజిస్ట్రేట్‌ యాంత్రిక ధోరణిలో రిమాండ్‌కు పంపారన్నారు. వారందరు ప్రస్తుతం బెయిలు పొందారన్నారు.

పర్చూరు నియోజకవర్గం పరిధిలో తప్పుడు ఫారం7 దాఖలు చేసి భారీగా ఓట్లను తొలగించిన వ్యవహారంపై ఎమ్మెల్యే హైకోర్టులో వ్యాజ్యం వేశారన్నారు. ఎన్నికల సంఘం విచారణ జరపిందన్నారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు సస్పెండ్‌ అయ్యారన్నారు. ఈ కారణంగా పిటిషనర్‌పై కక్షపూరితంగా తప్పుడు కేసు పెట్టారని పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్ని ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవన్నారు. నేర ఘటన తీవ్రత తక్కువైనందున ముందస్తు బెయిలు మంజూరు చేయాలని లేదా 41ఏ నిబంధనలను పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.

తాడేపల్లికి చేరిన వేల కోట్లపై నోరు విప్పే ధైర్యం వాసుదేవారెడ్డికి ఉందా?: ఏలూరి సాంబశివరావు

పోలీసుల తరఫున పీపీ వై నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్న కేసులలో అరెస్టు చేయాలా? లేదా 41ఏ నోటీసు ఇవ్వాలా అనేది దర్యాప్తు అధికారి విచక్షణాధికారం అన్నారు. నోటీస్‌ తప్పనిసరేం కాదన్నారు. ఇందుకు పోలీసులను బలవంతం చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సోమవారం నాటి హైకోర్టు వ్యాఖ్యలను పత్రికల్లో ప్రచురించారని, అవి పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. పత్రికల్లో వచ్చే వార్తలను ఏవిధంగా నిలువరించగలమని ఆయన ప్రశ్నించారు.

పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం : ఏలూరి సాంబశివరావు

వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని వ్యాఖ్యానించారు. సర్క్యులేషన్‌ పెంచుకునేందుకు అనేక కథనాలు వస్తుంటాయన్నారు. వాటిపై తాను స్పందించలేనన్నారు. తనకూ వ్యతిరేకంగా వార్తలొచ్చాయని గుర్తుచేశారు. శాసనకర్తలే అరెస్టుకు భయపడుతూ 41ఏ నోటీసు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. పత్రికల్లో ప్రచురించిన వార్తలు పరువునష్టానికి చెందినవైతే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ చట్టనిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కోర్టులో విచారణ ప్రక్రియపై వార్తలు రాస్తుంటారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.