Hero Venkatesh Daughter Ashrita Election Campaign : సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత ప్రచారంలో పాల్గొంది. వెంకటేశ్ కుమార్తె ఏంటి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అసలు రాజకీయాలతో వెంకటేశ్ కుమార్తెకు సంబంధం ఏంటి? నిజంగా ఆశ్రిత ఎన్నికల క్యాంపైన్లో పాల్గొని ప్రసంగించారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఎవరి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు? ఎవరికి మద్దతు ఇస్తున్నారనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కూటమి మేనిఫెస్టో ఏ వర్గానికి ఎలాంటి భరోసా ఇస్తోంది ? - NDA MANIFESTO 2024 IN AP
ఎప్పుడూ సినిమాలు, సినిమా నిర్మాణం అంటూ బిజీబిజీగా ఉండే ఫ్యామిలీ దగ్గుబాటి రామానాయుడు కుటుంబం. మొదటి నుంచి ఆ కుటుంబంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు తప్పితే, ఇప్పుడున్న సురేశ్, వెంకటేశ్ ఈతరం రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. వారి పనులను వారు సైలెంట్‌గా చేసుకుంటూ ఎప్పుడూ సినిమా ప్రపంచంలో మునిగిపోతారు. కానీ విక్టరీ వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత మాత్రం లోక్‌సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఆమె ప్రచారం చేస్తున్నారని అనుకుంటే కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి స్వయంగా ఆమెకు మామయ్య.
రాజధానుల పేరిట జగన్ మూడు ముక్కలాట - బలైన భవన నిర్మాణ కార్మికులు - CM Jagan Neglect Labours
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో వెంకటేశ్‌కు రఘురాంరెడ్డి వియ్యంకుడు అయ్యాడు. అలాగే ఆయన చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిను వివాహం చేసుకున్నారు. ఆశ్రిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూట్యూబ్ ఛానల్లో Infinity Platter పేరుతో ఒక కుకింగ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఆమె స్వయంగా ప్రొఫెషనల్ బేకర్. అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎవరైనా ఏదైనా సమాచారం అడిగితే యాక్టివ్‌గా ఉంటూ వాటికి సమాధానాలు చెబుతుంది.
ఆశ్రిత ప్రచారం : అయితే ఒక్కసారిగా వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత కాంగ్రెస్ కండువా కప్పుకుని తన మామ రఘురాంరెడ్డిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేస్తోంది. ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గత నాలుగైదు రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఖమ్మంలో తన మామయ్య రఘరాంరెడ్డి విజయం కోసం ఎన్నికల క్యాంపైన్లో పాల్గొంటున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో జరిగే మీటింగ్‌లకు హాజరై, తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఆమె ప్రచారం చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయంటే నమ్మగలరా! మీరే చూడండి ఆ వీడియోను.