ETV Bharat / state

జగన్​ మళ్లీ గెలిస్తే ఎవరి భూములు మిగలవు - హెచ్చరించిన సినీనటుడు శివాజీ - Hero Shivaji Election campaign

Hero Shivaji Election campaign : కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా సినీనటుడు శివాజీ పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పూలతో స్వాగతించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

shivaji_election
shivaji_election
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 10:36 AM IST

Hero Shivaji Support to TDP Leader Prathipati Pullarao in Chilakaluripet : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు కూటమి నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తుంటే మరోవైపు సినీ నటులు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం జగన్​ పరిపాలనలో జరిగిన అన్యాయాలు, అరాచకాలను ప్రజలకు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు.

Shivaji Comments on Jagan : జగన్‌రెడ్డి మరోసారి సీఎం అయితే రాష్ట్రంలో ఎవరి భూములు మిగలనివ్వరని సినీనటుడు శివాజీ హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది దాని కోసమని, కబ్జా కోరుల చేతుల్లో అదొక ఆయుధంగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికివాడలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ఆయన కుమారుడు శరత్​తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. శరత్, శివాజీలకు మురికిపాడు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతలు పట్టారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రజలే పవన్‌ కల్యాణ్‌కు కుటుంబసభ్యులు: వరుణ్‌ తేజ్ - Varun Tej Election Campaign

Land Titling Act Shivaji Comments : సీఎం జగన్​ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములున్నాయి, వాటిని ఎలా కబ్జా చేయాలి అనే విషయంపై దృష్టి పెట్టారని శివాజీ ఆరోపించారు. భూరక్షణ పేరుతో భక్షిస్తారని పేర్కొన్నారు. భూ సర్వేలు చేసి భూములు గుట్టుమట్లు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. ల్యాండ్​ టైటిలింగ్​ యాక్టు ద్వారా వాటికి ఎసరు పెట్టే పని మొదలు పెట్టారని ఆరోపించారు.

జగన్​ మళ్లీ గెలిస్తే ఎవరి భూములు మిగలవు - హెచ్చరించిన సినీనటుడు శివాజీ

"ల్యాండ్​ టైటిలింగ్​​ యాక్ట్​ ఇప్పుడు మీ భూమి దాకా వచ్చింది. ఈ ఎన్నికల్లో జగన్​ మళ్లీ సీఎం అయితే మీ బ్రతుకు బంగాళాఖాతమే. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుని కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి. మే 13న జరిగే ఎన్నికల జీవన్​, మరణ సమస్య. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే సరైన విషయాన్ని తీసుకోండి " -సినీనటుడు శివాజీ

జోరుగా మంగళగిరిలో ఎన్నికల ప్రచారం-హోటల్ లో టిఫిన్​ చేసిన నారా బ్రాహ్మణి - Nara Brahmani Visit Small Hotel

Shivaji Election Campaign : చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేస్తే జగన్‌రెడ్డి హయాంలో 2 నుంచి 3 శాతం పనులు కూడా చేయలేకపోయారని శివాజీ ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ కక్ష, గుత్తేదారుల నుంచి కమీషన్లు దండుకోవడం కోసమే ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్‌రెడ్డి బలిపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో యువత కలలు సాకారం కావాలంటే చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని ప్రత్తిపాటి శరత్​ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఐటీ రంగంలో యువకులకు ప్రపంచస్థాయి అవకాశాలను బహుమతిగా ఇస్తే జగన్‌ రెడ్డి గంజాయిని, విద్వేషాల్ని నింపి ఒక తరానికే తీరని చేటు చేశారన్నారు.

ఎన్నికల ప్రచారంలో సినీ నటి కుష్భూ- కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి - Actress KUSHBOO ELECTION CAMPAIGN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.