ETV Bharat / state

"కేసు కొట్టేయండి" - హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్​ - ALLU ARJUN TO HIGH COURT

4న సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు

Hero Allu Arjun Petition
Hero Allu Arjun Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 6:41 PM IST

Updated : Dec 11, 2024, 7:27 PM IST

Allu Arjun Petition in Telangana High Court About sandhya Theatre incident : సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్‌ దాఖలు చేశారు. సంధ్య థియేటర్‌ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్‌ వేశారు.

ఇదీ జరిగింది: ఈనెల 4వ తేదీన రాత్రి పుష్ప2 మూవీ ప్రీమియర్‌ షో జరిగింది. పుష్ప-2 ప్రీమియర్ షో కోసం హైదరాబాద్​లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌ వద్దకు ఈ నెల నాలుగో తేదీ రాత్రి 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్​ వస్తున్నారని తెలిసి, ఆయనని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భారీగా వచ్చిన అభిమానులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దీంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందారు.

అల్లు అర్జున్‌ స్పందన: ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేయడంతో పాటు, పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్​లో సైతం విచారం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. అదే విధంగా రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం ప్రకటించారు. గత 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నానని, ఇలా ఎప్పుడూ జరగలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, అదే విధంగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇదే ఘటనలో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. రేవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన - ముగ్గురు అరెస్టు

సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్‌

Last Updated : Dec 11, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.