ETV Bharat / state

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు- జలాశయాలకు పోటెత్తిన వరద - Heavy rains in Uttarandhra

Heavy rains in Uttarandhra: కుండపోత వర్షాలకు ఉమ్మడి విశాఖ జిల్లాలో జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదకర స్థాయికి చేరాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించాయి. మోకాళ్ల లోతు నీరు రావడంతో బయటకు రాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Heavy_rains_in_Uttarandhra
Heavy_rains_in_Uttarandhra (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 3:42 PM IST

Updated : Sep 9, 2024, 5:21 PM IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు- జలాశయాలకు పోటెత్తిన వరద (ETV Bharat)

Heavy rains in Uttarandhra: ఉమ్మడి విశాఖ జిల్లాలో వర్షం దంచికొడుతోంది. భారీ వర్షం వల్ల అనకాపల్లి జిల్లా కోటవురట్లలో వ్యవసాయ సహకారబ్యాంకు జలదిగ్బంధమైంది. ప్రధాన రహదారితోపాటు సమీపంలోని ఇళ్లు నీటమునిగాయి. నర్సీపట్నం మండలం వేములపూడి వద్ద ఏలేరు కాలువ 82వ కిలోమీటరు సమీపంలో కాలువ లైనింగ్‌ను మించి నీటి ప్రవావం కొనసాగుతోంది. గండిపడే ప్రమాదం ఉండడంతో రైతులే స్వయంగా మట్టి బస్తాలు మోసుకొచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.

సీలేరు జలాశయానికి వరద పోటెత్తింది. సీలేరు జలాశయంలోని నాలుగు గేట్లు ఎత్తి 13వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లిగెడ్డ వంతెన కొట్టుకుపోయింది. ఫలితంగా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు నిలిచాయి. డొంక‌రాయి జ‌లాశ‌యం నుంచి లక్షా 10వేల క్యూసెక్కులు నీరు దిగువ‌కు విడుద‌ల‌ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉపమాక సమీపంలోని జగనన్న కాలనీ ముంపునకు గురైంది. మోకాళ్లు లోతు నీరు రావడంతో బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు.

చోడవరం నియోజకవర్గంలో వాగులు, గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. జలాశయం నాలుగు గేట్లు ఎత్తి వరద నీటిని వరాహా నదిలోకి విడుదల చేస్తున్నారు. కోనాం జలాశయం, పెద్దేరు జాలశయం నుంచి 1860 క్యూసెక్కుల వరదనీరు దిగువకు అధికారులు వదలడంతో బొడ్డేరు, పెద్దేరు నదులు నీటి ప్రవాహం అధికంగా ఉంది దీంతో వందలాది ఎకరాలలో నాటిన వరి, చెరకు పంటలు ముంపుకు గురయ్యాయి. రాష్ట్ర రహదారైన భీమిలి - నర్సీపట్నం రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. బుచ్చయ్య పేట మండలం విజయరామరాజు పేట వద్ద తాచేరు నది నీటి ప్రవాహం ఉధృతికి తాత్కాలిక డైవర్షన్ కల్వర్టు ధ్వంసమైంది.

'బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైఎస్సార్సీపీ నేతలవే'- అనుమానితుల కాల్​ డేటా విశ్లేషణ - PRAKASAM BARRAGE BOATS CASE

తీవ్ర వాయుగుండం ప్రభావంతో అల్లూరి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందుకూరుపేట నుంచి రావిలంక వెళ్లే రహదారిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పెద్దబయలు మండలం డెండ్రాయిపుట్టు గ్రామానికి చెందిన పుష్పావతి అనే గర్భిణీని తీసుకెళ్తున్న అంబులెన్సు వరద అవతలి గట్టుపైనే నిలిచిపోయింది. గర్భిణీకి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబసభ్యలు దిక్కుతోచని పరిస్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతపల్లి మండలం బందబయలు గ్రామంలో ఉండే బోరును ఎవరూ కొట్టకుండానే నీరు పైకి రావడంపై గ్రామస్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు - పూర్తిస్థాయి నీటిమట్టానికి జలాశయాలు - Heavy Rains in Uttarandra

ఏపీకి 6,880 కోట్లు ఇవ్వండి - కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం మధ్యంతర నివేదిక - AP Floods Damage Report

Last Updated : Sep 9, 2024, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.