ETV Bharat / state

హైదరాబాద్​లో మరో రెండ్రోజులు వర్షాలు - సిబ్బందికి సెలవులు రద్దు చేసిన జలమండలి - Heavy Rains in Hyderabad Today

Heavy Rains in Hyderabad Today : హైదరాబాద్​లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. వరదనీటితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. జలమండలి ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్​లతో ఎండీ అశోక్​ రెడ్డి జూమ్​ సమావేశం నిర్వహించారు. మరో రెండ్రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

Heavy Rains in Hyderabad Today
Heavy Rains in Hyderabad Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 10:34 AM IST

Updated : Aug 20, 2024, 12:35 PM IST

Heavy Rains In Hyderabad Today : రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో మరోసారి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులు చెరువుల్ని తలపించాయి. సోమవారం రాత్రి మొదలైన వర్షం మంగళవారం కూడా కురిసింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. మరో రెండ్రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రయాణాలకు తీవ్ర అంతరాయం : నగరంలో ఉదయం నుంచి కురిసిన వర్షానికి చాదర్​ఘాట్​ ఆజంపురా రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సకాలంలో డ్రైనేజీల్లో పూడికతీత చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సంబంధిత అధికారులు సిబ్బంది తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు రహదారులపై చేరిన నీటిని జీహెచ్​ఎంసీ సిబ్బంది కాలువల్లోకి మళ్లిస్తున్నారు. నాలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులను జీహెచ్​ఎంసీ అప్రమత్తం చేసింది. పురాతన శిథిల భవనాల పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని మహానగర పాలక సంస్థ సూచించింది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ వంతెన : మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అంబర్​పేట సహా పలు ప్రాంతాల్లో కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ముసారాంబాగ్ వద్ద మూసీ వంతెన ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పై నుంచి వరదనీటి ఉద్ధృతి పెరిగితే వంతెనను మూసివేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మూసారాంబాగ్​ అలీ కేఫ్​ జంక్షన్​ వద్ద మూసీ పరివాహక ప్రాంతాలను జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్​ మారుతి దివాకర్ పర్యవేక్షిస్తున్నారు. మూసీ వరద పరిస్థితిని అంచనా వేస్తూ అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నామని స్థానికులు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. అనవసరంగా బయటకు రావద్దని స్థానికులను సూచించారు.

హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం - చెరువులను తలపిస్తున్న రహదారులు - Rains In Hyderabad

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి - Heavy Rains in Hyderabad

Last Updated : Aug 20, 2024, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.