Heavy Rains in Hyderabad Due to Southwest Monsoon : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం కమ్ముకున్న మేఘాలకు తోడు ఈదురుగాలులు, ఉరుములతో పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభయింది. బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్, పంజాగుట్ట, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, గచ్చిబౌలి, పాతబస్తీ చార్మినార్ చాంద్రాయణగుట్ట, కోండాపుర్, లింగంపల్లి, బహదూర్పురా, మియాపూర్, ఫలక్ నుమ, బార్కస్, ఉప్పుగూడ, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మేట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, నిజం పేట్, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, బోరబండలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. వర్షంతో వాహనదారులు తడిసిముద్దయ్యారు. వేడిమి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాసేపు ఉపసమనం పొందారు.
Hyderabad Rains : సాయంత్రం వేళ భాగ్యనగరంలో వర్షం పడడంతో పనికి వెళ్లిన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి మాదాపూర్‌లో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షం కారణంగా సుమారు గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో అధికంగా ట్రాఫిక్ జామ్ ఉంది.
Heavy Traffic in Hyderabad : మాదాపుర్ మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా గచ్చిబౌలి బయోడైవర్సిటి మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ మార్గంల ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంది. భారీ వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు ఎక్కువగా చేరింది. హైటెక్ సిటీ శిల్పారామం వద్ద రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. శ్రీకృష్ణనగర్‌లో మ్యాన్ హోళ్లు పొంగుతున్నాయి. పలుచోట్ల నాలాలు పొంగడంతో రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని తొలగిస్తున్నారు. పోలీసులు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మరణించాడు.
హైదారబాద్‌లో పలుచోట్ల నమోదైన వర్షపాతం వివరాలు
- నాంపల్లి బేగంబజార్‌లో అత్యధికంగా 8.5 సెం.మీ
- బండ్లగూడ కందికల్ గేట్‌లో 8.13 సెం.మీ
- చార్మినార్‌లో 7.98 సెం.మీ
- కూకట్‌పల్లిలో 7.58 సెం.మీ
- ఖైరతాబాద్‌లో 7.40 సెం.మీ
- ఆసిఫ్‌నగర్‌లో 6 సెం.మీ
- శేరిలింగంపల్లిలో 4.63 సెం.మీ
తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు - ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
Hail rain in Yadadri : మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని ఏకధాటిగా కుండపోత వాన కురిసింది. సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, కంది, పటాన్‌చెరు, మామిడిపల్లిలో వర్షం పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోలో యాదాద్రి దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కాసేపు వడగండ్ల కూడా పడ్డాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలం సీతానగరం గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన తెలికపాటి వర్షంతోపాటు పెద్ద శబ్దంతో మామిడి చెట్టుపై పిడుగు పడటంతో మేకల సంతోశ్(14) అక్కడికక్కడే మృతి చెందాడు.