ETV Bharat / state

LIVE UPDATES : భారీ వర్షాల దృష్ట్యా అల్లూరి జిల్లాలోని ఘాట్‌రోడ్లు మూసివేత - Rains in AP 2024 - RAINS IN AP 2024

Rains in AP 2024
Rains in AP 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 9:56 AM IST

Updated : Jul 20, 2024, 3:42 PM IST

Heavy Rains in Andhra Pradesh : వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. వేల హెక్టార్లలో వరి నారు మళ్లు నీటమునిగాయి. రహదారులపైకి వరద చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

LIVE FEED

7:23 PM, 20 Jul 2024 (IST)

  • కర్ణాటకలో కృష్ణా పరివాహకంలో పెరిగిన వరద ప్రవాహం
  • ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీటి విడుదల
  • నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు విడుదల
  • జూరాల జలాశయానికి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • శ్రీశైలం జలాశయానికి 81,160 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

7:23 PM, 20 Jul 2024 (IST)

అల్లూరి జిల్లాలోని ఘాట్‌రోడ్లు మూసివేత

  • భారీ వర్షాల దృష్ట్యా అల్లూరి జిల్లాలోని ఘాట్‌రోడ్లు మూసివేత
  • రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు అల్లూరి జిల్లాలోని ఘాట్‌రోడ్లు మూసివేత
  • పాడేరు, అరకు, చింతపల్లి, మారేడుమిల్లి ఘాట్‌రోడ్లు మూసివేత
  • ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్‌రోడ్లు మూసివేస్తూ కలెక్టర్‌ ఆదేశం

7:22 PM, 20 Jul 2024 (IST)

వాహన రాకపోకలు నిలిపివేత

  • అనకాపల్లి: భీమిలి-నర్సీపట్నం రోడ్డులో వాహన రాకపోకలు నిలిపివేత
  • తాచేరు నదిలో డైవర్షన్‌ రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు నిలిపివేత
  • నర్సీపట్నం, అల్లూరి జిల్లా వెళ్లే వాహనాల రాకపోకలు బంద్

3:41 PM, 20 Jul 2024 (IST)

శ్రీశైలం జలాశయానికి భారీగా పెరిగిన వరద ప్రవాహం

  • శ్రీశైలం జలాశయానికి భారీగా పెరిగిన వరద ప్రవాహం
  • జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి 82,398 క్యూసెక్కుల ప్రవాహం
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 813 అడుగులు
  • ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 36.08 టీఎంసీల నీటినిల్వ

3:40 PM, 20 Jul 2024 (IST)

ఛత్తీస్‌గఢ్‌లో ఎర్రబూరు వద్ద హైవేపై వరద ప్రవాహంతో నిలిచిన రాకపోకలు

  • ఛత్తీస్‌గఢ్‌లో ఎర్రబూరు వద్ద హైవేపై వరద ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
  • ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య స్తంభించిన రాకపోకలు
  • అల్లూరి జిల్లా చింతూరు-కల్లేరు మధ్య హైవేపై పలుచోట్ల గండిపడి నిలిచిన రాకపోకలు

3:40 PM, 20 Jul 2024 (IST)

విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమీక్ష

  • విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమీక్ష
  • ఏపీఈపీడీసీఎల్ అధికారులతో అమరావతి నుంచి వర్చువల్‌గా సమీక్షించిన మంత్రి
  • భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
  • వర్ష ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్న గొట్టిపాటి
  • విద్యుత్ సరఫరా, ఇతర సమస్యల పరిష్కారానికి సమాయత్తం కావాలన్న మంత్రి
  • లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచన
  • వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
  • విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగినచోట సహాయచర్యలు ప్రారంభించాలని ఆదేశం
  • ప్రజలకు విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

3:39 PM, 20 Jul 2024 (IST)

గుంటూరు కలెక్టరేట్‌లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష

  • గుంటూరు కలెక్టరేట్‌లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష
  • గత సమీక్షలో దృష్టికొచ్చిన సమస్యల పరిష్కారం, పనుల పురోగతిపై సమీక్ష
  • రోగులకు మెరుగైన వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం: పెమ్మసాని
  • వినుకొండ హత్య ఘటనపై జగన్‌ విమర్శలు హాస్యాస్పదం: మంత్రి పెమ్మసాని
  • జగన్ వైఖరి వల్ల దేశవ్యాప్తంగా రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది: మంత్రి పెమ్మసాని

1:26 PM, 20 Jul 2024 (IST)

  • వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులతో సమీక్ష
  • శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో ఫోనులో మాట్లాడిన అనిత
  • వర్షాల ప్రభావం, తాజా పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి అనిత
  • అల్లూరి జిల్లాలో 7 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
  • అల్లూరి జిల్లా కలెక్టర్ సూచనతో వరద ప్రాంతాల్లో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు
  • ఆహారం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై దృష్టిపెట్టాలని ఆదేశం
  • చింతూరు ఏజెన్సీలో వరద సహాయ శిబిరాలు ఏర్పాటు
  • వరద ప్రభావిత ప్రాంతాల్లోని గర్బిణీలు, రోగులను సమీప ఆస్పత్రులకు తరలింపు
  • వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి అనిత

12:32 PM, 20 Jul 2024 (IST)

  • ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో వాయుగుండం కేంద్రీకృతం
  • మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం
  • ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి నైరుతి దిశగా 40 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • గోపాల్‌పూర్‌కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
  • వాయవ్యంగా కదులుతూ ఒడిశా-చత్తీస్‌గఢ్‌ భూభాగాలపైకి వచ్చే అవకాశం
  • మరో 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడనున్న వాయుగుండం
  • ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు
  • కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ నుంచి విస్తారంగా వానలు పడే అవకాశం
  • గంటకు 30-40 కి.మీ. వేగంతో ఉపరితలంపై గాలులు వీస్తాయని హెచ్చరికలు
  • మరో 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వానలు
  • రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల 5 సెం.మీ. కంటే అధిక వర్షపాతం నమోదు
  • భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు, వంకలు, నదుల్లోకి చేరిన వరద
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ

12:21 PM, 20 Jul 2024 (IST)

భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కందుల దుర్గేష్‌ ఆదేశం

  • తూ.గో.: పెరవలి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్‌
  • భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశం
  • నీటిపారుదల, వ్యవసాయశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి ఆదేశం

12:21 PM, 20 Jul 2024 (IST)

గొడుగుమామిడిలో వర్షాలకు కూలిన ఇంటి గోడ

  • అల్లూరి జిల్లా: గొడుగుమామిడిలో వర్షాలకు కూలిన ఇంటి గోడ
  • అల్లూరి జిల్లా: శిథిలాల కింద చిక్కుకున్న యువతిని కాపాడిన స్థానికులు
  • విశాఖ: తాటిచెట్లపాలెం ధర్మానగర్ శివాలయం వద్ద కూలిన ప్రహరీ గోడ

11:41 AM, 20 Jul 2024 (IST)

వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: మంత్రి అచ్చెన్న

  • వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: మంత్రి అచ్చెన్న
  • రైతులకు క్షేత్రస్థాయిలో సూచనలు అందించాలి: మంత్రి అచ్చెన్న
  • పంట నష్టాన్ని ప్రాథమిక స్థాయిలోనే అంచనా వేయాలి: మంత్రి అచ్చెన్న
  • రైతు సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు: మంత్రి అచ్చెన్న

11:20 AM, 20 Jul 2024 (IST)

  • ఉమ్మడి విజయనగరం, అల్లూరి జిల్లాల్లో వర్షాలపై మంత్రి సంధ్యారాణి ఆరా
  • అమరావతి నుంచి కలెక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న సంధ్యారాణి
  • భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది: మంత్రి సంధ్యారాణి
  • వాగులు, గెడ్డలు పొంగడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సంధ్యారాణి
  • అత్యవసర పరిస్థితుల్లో తప్ప స్థానికులు గెడ్డలు, వాగులు దాటవద్దు: సంధ్యారాణి
  • మత్సకారులు వేటకు వెళ్లవద్దు: మంత్రి సంధ్యారాణి
  • పాత భవనాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సంధ్యారాణి

10:38 AM, 20 Jul 2024 (IST)

పెంకుటిల్లు కూలి కారం లక్ష్మి అనే మహిళ మృతి

  • అల్లూరి జిల్లా: రంపచోడవరం మండలం మడిచర్లలో వర్షానికి కూలిన పెంకుటిల్లు
  • అల్లూరి జిల్లా: పెంకుటిల్లు కూలి కారం లక్ష్మి(53) అనే మహిళ మృతి

10:37 AM, 20 Jul 2024 (IST)

తిరువూరు నియోజకవర్గంలో పరవళ్లు తొక్కుతున్న వాగులు

  • ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గంలో పరవళ్లు తొక్కుతున్న వాగులు
  • కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, కొండ వాగుల్లో పెరుగుతున్న వరద
  • కట్లేరు వరద ఉద్ధృతితో గంపలగూడెం-చీమలపాడు మార్గంలో నిలిచిన రాకపోకలు
  • తిరువూరు-అక్కపాలెం రహదారిలో వంతెనపైకి చేరుతున్న పడమటి వాగు వరద
  • చిట్టేల-జి.కొత్తూరు మార్గంలో చౌటపల్లి వద్ద వంతెనపైకి ఎదుళ్లవాగు వరద
  • వరద ప్రవాహం మరింత పెరిగితే రెండు మార్గాల్లో నిలిపోనున్న రాకపోకలు
Rains in AP 2024
తిరువూరు నియోజకవర్గంలో పరవళ్లు తొక్కుతున్న వాగులు (ETV Bharat)

10:21 AM, 20 Jul 2024 (IST)

వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి పర్యటన

  • ఏలూరు జిల్లా: వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి పర్యటన
  • వేలేరుపాడు మండలంలో బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై మంత్రి ఆరా
  • తాగునీరు, ఆహారం అందించడంతోపాటు వైద్య సేవలు సకాలంలో అందించాలని ఆదేశం
Heavy Rains in Andhra Pradesh
లోతట్టు ప్రాంతాల్లో నీటిలోనే నానుతున్న వరి పొలాలు (ETV Bharat)

9:48 AM, 20 Jul 2024 (IST)

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా అధికారులంతా అందుబాటులో ఉండాలి: మంత్రి అచ్చెన్న

  • వర్షాలపై కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్‌తో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు
  • శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా అధికారులంతా అందుబాటులో ఉండాలి: మంత్రి అచ్చెన్న
  • అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్న
  • మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దు: మంత్రి అచ్చెన్నాయుడు
  • సహాయచర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని వినియోగించుకోవాలి: అచ్చెన్న
  • విద్యుత్ సమస్యలు పరిష్కరించేలా సిబ్బంది సమాయత్తం కావాలి: మంత్రి అచ్చెన్న
  • లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: అచ్చెన్న

9:47 AM, 20 Jul 2024 (IST)

ఎడతెరిపి లేని వర్షాలతో స్తంభించిన జనజీవనం

  • ఎన్టీఆర్ జిల్లా: నందిగామ నియోజకవర్గంలో రెండ్రోజులుగా వర్షాలు
  • చందర్లపాడు-పాటింపాడు మధ్య రహదారిపై గుర్రాలవాగు వరద ప్రవాహం
  • వరద ప్రవాహంతో చందర్లపాడు-పాటింపాడు మధ్య నిలిచిన రాకపోకలు
  • ఎన్టీఆర్ జిల్లా: ఎడతెరిపి లేని వర్షాలతో స్తంభించిన జనజీవనం

9:47 AM, 20 Jul 2024 (IST)

గోదావరిలో నిలకడగా వరద ప్రవాహం

  • రాజమహేంద్రవరం: గోదావరిలో నిలకడగా వరద ప్రవాహం
  • ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 7.8 అడుగుల నీటిమట్టం
  • తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 1,800 క్యూసెక్కులు విడుదల
  • సముద్రంలోకి 3 లక్షల 9 వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల

9:46 AM, 20 Jul 2024 (IST)

వరద ప్రవాహంతో కేడీపేట-చింతపల్లి మధ్య నిలిచిన రాకపోకలు

  • అల్లూరి జిల్లా: కొయ్యూరు మం. రామరాజుపాలెం వద్ద వంతెనపై వరద
  • వంతెన పైనుంచి వరద ప్రవాహంతో కేడీపేట-చింతపల్లి మధ్య నిలిచిన రాకపోకలు

9:46 AM, 20 Jul 2024 (IST)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు

  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు
  • ఉమ్మడి తూ.గో. జిల్లాలో నీటిలోనే నానుతున్న వరి పంట
  • తూ.గో., కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 12 వేల హెక్టార్లకుపైగా మునిగిన వరినాట్లు
  • వరి పంటను ముంచెత్తిన కొవ్వాడ ఎర్రకాల్వలు
  • కోనసీమలోని లోతట్టు ప్రాంతాల్లో నీటిలోనే నానుతున్న వరి పొలాలు

9:46 AM, 20 Jul 2024 (IST)

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వట్టిగెడ్డ జలాశయం పొర్లుకాలువ

  • అల్లూరి జిల్లా: రాజవొమ్మంగి మం. ఎర్రంపాడు వద్ద వరద ఉద్ధృతి
  • అల్లూరి జిల్లా: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వట్టిగెడ్డ జలాశయం పొర్లుకాలువ
  • పొర్లుకాలువ ఉద్ధృతితో ఎర్రంపాడు, గింజర్తి గ్రామాలకు నిలిచిన రాకపోకలు

9:45 AM, 20 Jul 2024 (IST)

గరిష్ఠ స్థాయికి చేరిన కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం

  • అనకాపల్లి జిల్లా: గరిష్ఠ స్థాయికి చేరిన కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం
  • అనకాపల్లి జిల్లా: కల్యాణపులోవ జలాశయం 2 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
  • అనకాపల్లి జిల్లా: తాండవ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు
  • అనకాపల్లి జిల్లా: తాండవ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 365.4 అడుగులు
  • అనకాపల్లి జిల్లా: తాండవ జలాశయం ఇన్‌ఫ్లో 1,273 క్యూసెక్కులు
  • విద్యుత్ సమస్యల పరిష్కారానికి నర్సీపట్నం డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌

9:45 AM, 20 Jul 2024 (IST)

పులిచింతల ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద

  • పులిచింతల ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద
  • పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 175 అడుగులు
  • పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 100 అడుగులు
  • పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 450 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 50 క్యూసెక్కులు

9:45 AM, 20 Jul 2024 (IST)

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
  • ప్రస్తుతం పూరీ తీరానికి వాయవ్యంగా 40 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • గోపాలపూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
  • ఒడిశా నుంచి చిలకసరస్సు దగ్గరగా వాయుగుండం
  • గంటకు 3 కి.మీ. వేగంతో కదులుతున్న వాయుగుండం
  • వాయవ్యంగా కొనసాగుతూ ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ మధ్య తీరం దాటే అవకాశం
  • 24 గంటల్లో ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ సమీపంలో తీరం దాటనున్న వాయుగుండం
  • ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

9:45 AM, 20 Jul 2024 (IST)

వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మన్యం జిల్లా డీఈవో

  • వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మన్యం జిల్లా డీఈవో

9:44 AM, 20 Jul 2024 (IST)

తాడిగిరి వంతెన పైనుంచి వరద ప్రవాహం

  • అనకాపల్లి జిల్లా: తాడిగిరి వంతెన పైనుంచి వరద ప్రవాహం
  • పంచాయతీ పరిధిలోని 10 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
  • అనకాపల్లి జిల్లా: వర్షానికి కొట్టుకుపోయిన వరినాట్లు, ఆందోళనలో రైతులు

9:43 AM, 20 Jul 2024 (IST)

విశాఖ జిల్లాలో వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌

  • విశాఖ జిల్లాలో వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌

9:41 AM, 20 Jul 2024 (IST)

  • అల్లూరి జిల్లా: చింతూరు, కుయుగురు మధ్య వంతెన పైనుంచి వాగు ప్రవాహం
  • వాగు ఉద్ధృతికి ఏపీ-ఒడిశా మధ్య తాత్కాలికంగా నిలిచిన రాకపోకలు
  • వర్షానికి సగభాగం కొట్టుకుపోయిన కించుమండ గెడ్డ కితలంగి రోడ్డు వంతెన
  • అల్లూరి జిల్లా: జి.మాడుగుల పాత రెవెన్యూ కాలనీలో కుంగిన తాగునీటి బావి
  • అల్లూరి జిల్లా: లక్ష్మీపురం వద్ద పొంగి ప్రవహిస్తున్న గెడ్డ
  • అల్లూరి జిల్లా: ముంచంగిపుట్టులో పొంగుతున్న వాగులు, గెడ్డలు
  • అల్లూరి జిల్లా: జీకేవీధి మండలం ఆర్వీ నగర్‌లో బురదలో చిక్కుకున్న బస్సు
Rains in AP 2024
ఏపీ-ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు (ETV Bharat)

9:41 AM, 20 Jul 2024 (IST)

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు
  • ఎగువన భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద
  • బ్యారేజ్‌ నుంచి కాల్వల ద్వారా 3,000ల క్యూసెక్కులు విడుదల
  • నీటి విడుదల దృష్ట్యా దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • వర్షాల కారణంగా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
  • ఎడతెరపి లేని వర్షాలతో వరి రైతుల్లో ఆందోళన
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

9:40 AM, 20 Jul 2024 (IST)

వర్షాల కారణంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు

  • శ్రీకాకుళం జిల్లా: వర్షాల కారణంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు
  • శ్రీకాకుళం జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులకు నేడు సెలవు రద్దు
  • లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన

9:39 AM, 20 Jul 2024 (IST)

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం

  • ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం
  • భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
  • అధికారులను అప్రమత్తం చేసిన రెండు జిల్లాల కలెక్టర్లు
  • భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో పొంగుతున్న వాగులు, గెడ్డలు
  • వాగుల ఉద్ధృతి దృష్ట్యా తహసీల్దార్లను అప్రమత్తం చేసిన కలెక్టర్లు
  • స్థానికులు గెడ్డలు దాటకుండా నివారించాలని విజయనగరం కలెక్టర్‌ ఆదేశం
  • జిల్లాలోని విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించిన విజయనగరం కలెక్టర్

9:36 AM, 20 Jul 2024 (IST)

విజయనగరం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌

  • విజయనగరం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌
  • విజయనగరం: అల్పపీడనం వల్ల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విజయనగరం కలెక్టర్

Last Updated : Jul 20, 2024, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.