ETV Bharat / state

అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు- ప్రమాద స్థాయికి డుడుమ - Rains in Alluri District - RAINS IN ALLURI DISTRICT

Heavy Rains in AP : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లా అతలాకుతలమవుతోంది. వాగులు, గడ్డలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షాలకు రాకపోకలు స్తంభించడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Rains in Alluri District
Rains in Alluri District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 2:15 PM IST

Updated : Sep 8, 2024, 4:12 PM IST

Rains in Alluri District : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. జిల్లాలో రాజవొమ్మంగి, మారేడుమిల్లి, అరకులోయ, జీకే వీధి, పాడేరు మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.

పలుచోట్ల స్తంభించిన రాకపోకలు : రంపచోడవరంలోని భూపతిపాలెం జలాశయం 2 గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీరు విడుదల చేశారు. ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన రంపచోడవరంలో వారపు సంత కావడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గంగవరం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. కొండవాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ అభిషేక్ తెలిపారు. గడ్డలు, వాగులు దాటరాదని చెప్పారు. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra

ఆర్టీసీ బస్సు బోల్తా : అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క డొంకలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రాజమహేంద్ర వరం నుంచి నర్సీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కల్వర్టులు కొట్టుకుపోతున్నాయి. గూడెం కొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ వద్ద చామగడ్డ కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో అటువైపు వెళ్లే 20 -30 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు వరి పంటలు పూర్తిగా మునిగిపోతున్నాయి.

ప్రమాద స్థాయికి డుడుమ జలాశయం : ఆంధ్ర-ఒడిశా రాష్ట్రల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం ప్రమాద స్థాయికి చేరుకుంది. 2590 అడుగుల నీటి సామర్థ్యం గల డుడుమ జలాశయంలో ప్రస్తుతం 2587.20 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యలు కింద ఉదయం నుంచి జలాశయంలోగల మూడు, అయిదవ నెంబర్ల గేట్‌లను ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.

వేల క్యూసెక్కుల నీరు విడుదల : వరద ఉదృతి తగ్గు ముఖం పట్టకపోవడంతో మధ్యాహ్నం మళ్లీ ఈ రెండు గేట్లను చేరో అడుగు ఎత్తి మొత్తం ఆరువేల క్యూసెక్కుల వరద నీటిని దిగువున విడుదల చేశారు. విద్యుత్ కేంద్రానికి ఏడది పాటు నీరందించే జోలాపుట్‌ జలాశయం కూడ ప్రమాద స్థాయికి చేరుకుంది. 2750 అడుగుల సామర్ధ్యం గల జోలాపుట్‌లో మధ్యాహ్ననికి 2748.90 అడుగులకు చేరుకుంది. దీంతో జోలాపుట్‌ స్పిల్‌వే జలాశయం నుంచి రెండు గేట్ల ద్వారా 5000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.

స్కూల్​కు వెళ్లాలంటే టీచర్లు సాహసం చేయాల్సిందే - ఎందుకంటే ! - TEACHERS PROBLEMS TO GO TO SCHOOL

భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు - తప్పని గిరిజనుల కష్టాలు - Heavy Rains Streams Flowing in AP

Last Updated : Sep 8, 2024, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.