ETV Bharat / state

హైదరాబాద్​లో మరోసారి భారీవర్షం - పలుచోట్ల ట్రాఫిక్ జామ్ - Heavy rains in Telangana - HEAVY RAINS IN TELANGANA

Heavy Rain in Hyderabad : ఉదయం నుంచి కాస్త ఎండగా ఉండటంతో ఊపిరితీసుకున్న భాగ్యనగరవాసికి వరుణుడు మరోసారి షాకిచ్చాడు. సాయంత్రం వేళ నగరంలో భారీవర్షం మొదలైంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు, స్కూళ్ల నుంచి బయలుదేరిన విద్యార్థులు అంతా వర్షంతో ఇబ్బందులు పడ్డారు.

Heavy Rains Alert Today
Heavy Rain in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 6:08 PM IST

Updated : Sep 6, 2024, 7:42 PM IST

Heavy Rains Alert Today : హైదరాబాద్​ను మరోసారి భారీవర్షం కుదిపేసింది. సరిగ్గా స్కూళ్లు, ఆఫీసులు వదిలే సమయానికి వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. ముందుగా మేడ్చల్​లో ప్రారంభమైన వర్షం నగరమంతటా విస్తరించింది. సికింద్రాబాద్, మియాపూర్‌, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, నారాయణగూడ, కోఠి, దిల్​సుఖ్​ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్​మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

నాంపల్లిలో భారీ వర్షానికి నాంపల్లి స్టేషన్ రోడ్​లో రహదారిపై భారీగా చేరిన నీరు చేరింది. ఫలితంగా షాపులలోకి నీరు చేరడంతో యజమానులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్ నెక్టర్ గార్డెన్స్ దగ్గర స్వల్ప సమయంలోనే కురిసిన భారీవర్షంతో రోడ్లపై అడుగు మేర నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

రహదారులపై మోకాలు లోతు నీరు : సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు అంతా ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల రహదారులపైకి మోకాలు లోతు నీరు రావడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రేపు, ఎల్లుండి సెలవు కావడంతో సొంతూళ్లకు వెళ్లాలని బయలుదేరిన వారు వర్షంలో తడిసి ముద్దయ్యారు. పండుగ షాపింగ్ కోసం బయటకు వచ్చిన వారిని అకస్మాత్తుగా కురిసిన వాన ఇబ్బందులు పెట్టింది.

భారీవర్షంతో రోడ్లపైకి నీరు చేరడంతో జీహెచ్​ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలిచిన చోట నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు రోడ్లపై నెమ్మదిగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసరమైన పనులు ఉన్నవారు తప్ప మిగతా వారు ఇంట్లోనే ఉండాలని బల్దియా అధికారులు సూచించారు.

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు : మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద ఈనెల 9న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - ఆ రెండు తేదీల్లో మాత్రం జర జాగ్రత్త! - Heavy Rain Alert to Telangana

బిగ్​ అలర్ట్​ : రాష్ట్రంలో ఐదురోజులపాటు భారీ వర్షాలు - ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Heavy Rain Alert to Telangana

Last Updated : Sep 6, 2024, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.