ETV Bharat / state

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - ఇవాళ రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు - HEAVY RAIN ALERT TO TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 8:04 AM IST

Updated : Jul 17, 2024, 8:57 AM IST

Heavy Rain Alert In Telangana : తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Heavy Rain Alert in Telangana And Orange Alert to Several District
Heavy Rain Alert in Telangana And Orange Alert to Several District (ETV Bharat)

Rain Alert in Telangana : రాష్ట్రంలో రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలలు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెంటీ మీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వివరించింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్‌ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగవచ్చని ప్రజలు తగిన జాగ్తత్తలు పాటించాలని సూచించింది.

గురువారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడ్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశముంది.

శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయని వెల్లడించింది

5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు - హైదరాబాద్​కు రెయిన్ అలర్ట్ - Heavy Rain Alert for Hyderabad

ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన : శనివారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వానలు పడతాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి.

రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటీ మీటర్ల వర్షం పడింది. ఆదిలాబాద్‌ బోథ్‌ మండలం సోనాలలో 7.8, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 7.6, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వానలు పడ్డాయి.

హైదరాబాద్​కు భారీ వర్ష సూచన - అప్రమత్తమైన అధికారులు - Rain Alert in Hyderabad Today

హైదరాబాద్​లో భారీవర్షం - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న మేయర్​ - Hyderabad Rains Update

Last Updated : Jul 17, 2024, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.