Heavy Loss to Mango Farmers in Krishna District: పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడిని పండించే రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. పురుగు మందులు, ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వక మంగు, తెగుళ్లు సోకి దిగుబడి రాక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నష్టాలను భరించలేక ఎన్నోఏళ్లుగా పెంచుకున్న చెట్లను నరికేస్తున్నారు.
అకాల వర్షం - తడిచిన మొక్కజొన్న, ధాన్యం - నష్టపోయామంటున్న అన్నదాతలు - Crop Got Wet to Rains in AP
కృష్ణా జిల్లా అవనిగడ్డ, మోపిదేవి మండలంలోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తారు. ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు మామిడిని ఎగుమతి చేస్తుంటారు. బంగినపల్లి మామిడికి అవనిగడ్డ లంక తోటలు ప్రసిద్ధి. గత నాలుగు సంవత్సరాలుగా పండుఈగ ఇక్కడి మామిడి రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది. కాయపై వాలి చిన్న రంధ్రం చేస్తుంది. దీని ప్రభావంతో మామిడికాయపై మచ్చ ఏర్పడి పండకుండా రాలిపోతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడి కూడా రాక అప్పులు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. నష్టాలు తీవ్రమవటంతో కొందరు చెట్లను నరికేస్తున్నారు.
పొగాకు ధర ఆశాజనకం- రైతుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం - Tobacco Price Rise in AP
తెలుగుదేశం ప్రభుత్వంలో మామిడి రైతులకు ఉద్యానశాఖ ద్వారా ఫ్రూట్ కవర్లు సబ్సిడీపై అందించేది. పండు ఈగ నిర్మూలనకు లింగాకర్షక బిల్లలు సబ్సిడీపై ఇచ్చేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమను గాలికి వదిలేసిందని మామిడి రైతులు అంటున్నారు. ప్రస్తుతం ఫ్రూట్ కవర్లు రెండున్నర రూపాయలకు కొనుక్కుంటున్నామంటున్నారు. మొత్తంగా ఒక్కో కాయను కాపాడుకునేందుకు నాలుగు రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మందులు పిచికారి చేసినా పూత, కాపులేక ఈ సంవత్సరం దిగుబడి తగ్గిపోయింది. ఈ సంవత్సరం దిగుబడులు 60 శాతం మేరకు తగ్గిపోయాయి. వీటన్నిటికి తోడు మార్కెట్‌లో సరైన ధర లేక రైతులు తల్లడిల్లుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా మామిడి కాయలకు కవర్లు, ఎరువులు, పురుగు మందులు, లింగాకర్షక బిళ్లలు సబ్సిడీ పై అందించాలని పండుఈగ నిర్మూలనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని మామిడి రైతులు కోరుతున్నారు. ఏళ్లుగా పెంచుకుంటున్న మామిడి తోటలను నరికి వేసుకోకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఉద్యానశాఖ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆదుకోవాలని మామిడి రైతులు కోరుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న తోటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
తారుమారైన కోనసీమ కొబ్బరి పరిస్థితులు - ధరల పతనంతో రైతన్న కుదేలు - Coconut Prices Fall in ap