HC on YSRCP Lella Appireddy Petition: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి వెనక వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ఉన్నారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేరు చేర్చారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2021 అక్టోబర్లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి - అప్పిరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా - HC on Lella Appireddy Petition - HC ON LELLA APPIREDDY PETITION
HC on YSRCP Lella Appireddy Petition: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 2:23 PM IST